Nagarjuna: ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ .. నాగార్జున ఎమోషనల్ ట్వీట్! ఎందుకంటే

నాగార్జున తండేల్ సక్సెస్ నేపథ్యంలో కొడుకు నాగచైతన్య పై ప్రశంసలు కురిపించారు. నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నా. తండేల్‌ ఒక సినిమా మాత్రమే కాదు. నీ ఎనలేని అభిరుచికి, కృషికి, పెద్ద కలలుకనే ధైర్యానికి నిదర్శనం. ప్రౌడ్ ఆఫ్ యు మై సన్ అంటూ ట్వీట్ చేశారు.

New Update
nagarjuna

nagarjuna

Nagarjuna:  అక్కినేని నాగచైతన్య- సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'తండేల్' సూపర్ హిట్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది.  తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 41.20 కోట్ల వసూళ్లను రాబట్టింది. మరోవైపు విదేశాల్లోనూ 'తండేల్'  జోరు బాగానే కొసాగుతోంది.  ఓవర్సీస్ లో తొలి రోజు  3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్ చేసింది. 

Also Read: Priyanka Chopra: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ప్రియాంక చోప్రా డాన్స్.. అంబానీ కుటుంబం కూడా.. వీడియో వైరల్!

నాగార్జున ట్వీట్ 

సినిమా సక్సెస్ నేపథ్యంలో తాజాగా  కింగ్ నాగార్జున కొడుకు నాగ చైతన్యను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చై నా కొడుకుగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. తండేల్ ఒక సినిమా మాత్రమే కాదు. నీ ఎనలేని అభిరుచి, కృషి, పెద్ద కలలు కనే ధైర్యానికి నిదర్శనం. అక్కినేని అభిమానులంతా ఓ కుటుంబంలా మాకు అండగా నిలిచారు. తండేల్ సక్సెస్ మనందరిదీ. మీ అంతులేని సపోర్ట్, ప్రేమకు ధన్యవాదాలు. సాయి పల్లవి అద్భుతమైన టాలెంట్ ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తుంది. అల్లుఅరవింద్, బన్నీ వాసు, దేవి, చందూమొండేటి, చిత్ర బృందానికి అభినందనలు అని ట్వీట్ చేశారు. 

Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు