Priyanka Chopra: తమ్ముడి పెళ్లి ఊరేగింపులో ప్రియాంక చోప్రా డాన్స్.. అంబానీ కుటుంబం కూడా.. వీడియో వైరల్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్థ్ చోప్రా వివాహం గ్రాండ్ గా జరిగింది. సోదరుడి భరాత్ లో ప్రియాంక డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త నిక్ తో కలిసి ప్రియాంక స్టెప్పులేస్తూ కనిపించారు.

New Update
Priyanka Chopra dance

Priyanka Chopra dance

Priyanka Chopra: స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న సిద్దార్థ్- నీలం ఉపాధ్యాయ్‌ను 2025 ఫిబ్రవరి 7న మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు.  ముంబై వేదికగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు పలువురు సెలెబ్రెటీలు, ప్రముఖులు హాజరయ్యారు. అంబానీ కుటుంబం కూడా పెళ్లి వేడుకల్లో కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. నీతా అంబానీ, కోడలు శ్లోకా అంబానీ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: Thandel day 1 collections: బాక్స్ ఆఫీస్ వద్ద తండేల్ జోరు.. డే 1 ఎంత కలెక్ట్ చేసిందంటే?

ప్రియాంక డాన్స్ 

ఈ క్రమంలో తమ్ముడి వివాహ ఊరేగింపులో నటి ప్రియాంక చోప్రా డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త నిక్ తో కలిసి ప్రియాంక స్టెప్పులేశారు. సోదరుడి వివాహంలో ప్రియాంక ఆక్వా బ్లూ రంగు స్ట్రాప్‌లెస్ లెహంగా ధరించి అందంగా ముస్తాబయ్యారు. నిక్ శర్వాణీ ధరించి రాయల్ లుక్ లో కనిపించారు. తన సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు ప్రియాంక. 

ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రియాంక చోప్రా అత్తమామలు కూడా ఆమె సోదరుడి పెళ్లి కోసం ఇండియా వచ్చారు. ప్రియాంక అత్త డెవిస్  భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవగా..  ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు విషెస్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read:Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

Advertisment
తాజా కథనాలు