Pushpa-2: ‘పుష్ప2’ రిలీజ్ వేళ.. నాగబాబు ఆసక్తికర ట్వీట్

అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాపై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిసినిమా విజయం సాధించాలని..ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రియులు సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

New Update
pushpa 2 (4)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా ఆగమేఘాలతో రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు ఆసక్తిక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా అని అన్నారు.

Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

నాగబాబు ఆసక్తికర ట్వీట్

‘‘సినిమా అంటే వందలాది మంది కష్టానికి ఫలితం దక్కుతుంది. సినీ పరిశ్రమలో వేల మంది పనిచేస్తున్నారు. మనమంతా పరిశ్రమలో భాగమే. ప్రతి సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రేమికులందరూ సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

సాయి ధరమ్ తేజ్ ట్వీట్

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప2 సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. పుష్ప2 మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అల్లు Vs మెగా వార్ ఎలా స్టార్ట్ అయిందంటే?

ఇప్పటి వరకు అల్లు వెర్సస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఎప్పుడైతే బన్నీ తన ఫ్రెండ్, వైసీపీ నాయకుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎన్నికల సమయంలో మద్దతు తెలిపాడో అప్పటి నుంచి టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు టార్గెట్ అయ్యాడు. 

అది అక్కడితో ఆగకుండా మెగా ఫ్యామిలీని సైతం పాకింది. ఎప్పుడైతే బన్నీ శిల్పా రవికి మద్దతు ఇచ్చాడో.. మరు క్షణమే.. నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. మనవాళ్లు పరాయివాళ్లు అయ్యారు.. పరాయివాళ్లు మనవాళ్లు అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి మొదలైంది. అల్లు వెర్సస్ మెగా సోషల్ మీడియా వార్. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

అక్కడ నుంచి బన్నీ ఈవెంట్లలో పాల్గొని తనకు ఏది నచ్చితే అదే చెప్తానని అనడం.. తన ఫ్రెండ్‌కి మాట ప్రకారమే అతడికి మద్దతు తెలిపానని చెప్పాడు. తనకు పార్టీలతో సంబంధం లేదని మాట ఇచ్చానంటే అవతల ఎలాగున్నా వస్తానని అన్నాడు. ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్లు మాట్లాడాడు.

Also Read :  కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా.. ఒక్క మెగా హీరో కూడా రాలేదు. చిరంజీవి వస్తారని అంతా ఎదురుచూశారు. చిన్న చిన్న ఈవెంట్లకు వెళ్లే చిరు.. బన్నీ సినిమా ఈవెంట్‌కు రాకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ గొడవ వల్లే చిరు రాలేదని చర్చించుకున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషెస్ చెప్పడం అంతా ఆశ్చర్యపోతున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు