కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?

గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది.

New Update
Kakinada district

గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది. స్టెల్లా ఎల్ షిప్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ బియ్యం పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నారు. సీజ్ ది షిప్ అని పవన్ కళ్యాణ్ అనడంతో మీడియా అటెన్ష్ అంతా అటే మల్లింది. దీంతో కాకినాడ పోర్ట్ తీగపట్టుకొని లాగితే డొంకంతా కదలినట్టు పోర్ట్ లో ఇన్ని రోజులుగా జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ బయటపడుతున్నాయి.

వ్యాపారుల దగ్గర నుంచి అక్రమ వసుళ్లు

కాకినాడ పోర్ట్ కు నిత్యం 11 వందల వాహనాలు వస్తుంటాయి. అన్ని వాహనాలను తనిఖీ చేయడం కష్టం కాబట్టి.. పోర్ట్ అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. అదే అదునుగా తీసుకొని కొందరు లోకల్ వైకాపా లీడర్లు స్మగ్లింగ్ కు తెరలేపారు. పోర్ట్ అధికారులను కనుసైగల్లో పెట్టి వందల కోట్ల విలువైన బియ్యాన్ని సముద్రం దాటించారు. కాకినాడ టౌన్ నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మె్ల్యేగా గెలిచిన దర్మపురి చంద్రశేకర్ రెడ్డి సొంతంగా ఓ షిప్ కొని, రవాణా చేశారంట ఏ లెక్కన అక్కడ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. దర్మపుడి ఆయన సొదరుడు చిన్నబాబు కాకనాడ పోర్ట్ లో చెప్పిందే వేదంగా నడించింది గత ప్రభుత్వ హయాంలో. వ్యాపారులను బెందిరించి అక్రమవసూళ్లకు పాల్పడటం వంటివి జరుగుతుండేవి. నాగ్ పూర్ వ్యాపారిని బెదిరించి రూ.1.68 కోట్లు వసూలు చేశారని వార్తలు వస్తున్నాయి.

షిప్ ఆపే అధికారం ఎవరికుంది?

పోర్ట్ లో షిప్ లు ఆపే అధికారం పూర్తిగా పోర్ట్ అథారిటీకే ఉంటుంది. షిప్ లో రవాణా చేసే నిల్వల వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం వాటిల్లుతుందని గుర్తిస్తే షిప్ నిలిపివేసే అధికారం పోర్ట్ అధికారికి ఉంటుంది. హైకోర్ట్ అడ్మిరాలిటీతో నౌకను సీజ్ చేసే అధికారం ఉంటుంది. అంతేకానీ.. రాష్ట్రప్రభుత్వానికి పోర్ట్ షిప్ లను ఆపే అధికారం లేదు. షిప్ లు, పోర్టులు కేంద్ర ప్రభుత్వం అధీనంలోకి వస్తుంది. 

కాకినాడ పోర్ట్ వాటాలు అక్రమంగా బదలాయింపు

కాకినాడ పోర్టులో రూ.2500 కోట్ల విలువైన వాటాను కేవలం రూ.494 కోట్లకే అరవిందో సంస్థకు కట్టబెట్టింది గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రూ.1109 కోట్ల విలువైన కాకినాడ సెజ్ లైసెన్స్ రూ.12 కోట్లకే ఇస్తూ అధికార దుర్వనియోగానికి పాల్పడ్డారు. సీపోర్ట్ లో 41 శాతం, సెజ్ లో48 శాతం వాటాలను కేవీ రావు నుంచి అరవిందో సంస్థలకు అక్రమంగా బదలాయించారని కేవీ రావు ఫిర్యాదు ఇచ్చారు. 

పీడియస్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేయవచ్చా..

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ దరకు కొని వాటిని విదేశాలకు తరలిస్తున్నారు. ఇదే కాకినాడ పోర్ట్ లో జరగుతున్న రేషన్ బియ్యం మాఫియా. నవంబర్ 27న 640 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు అధికారులు. స్టెల్లా ఎల్ షిప్ అక్రమంగా రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ బియ్యం పశ్చిమ ఆసియాకు తరలిస్తున్నారు. అవి గతంలోనే పట్టుకున్న అక్రమ రేషన్ బియ్యమని బ్యాంక్ గ్యారెంటీ కట్టి విడుపించుకున్నారని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం స్టెల్లా ఎల్ షిప్ పట్టుకున్న బియ్యం కాకినాడ జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు