/rtv/media/media_files/2024/11/29/HAxzOP2Ei1VC8xbsThDs.jpg)
nagachaithanya
Naga Chaitanya- Sobhita: అక్కినేని ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నిన్న నాగచైతన్య - శోభిత హల్దీ వేడుకలను అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో గ్రాండ్ గా నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Marriage vibes started ❤️🩹❤️🩹🎉🎉
— °~•$@TyA__Ch@iThU•~°⚓🌊 (@satya_chaithu) November 29, 2024
Annayya & Vadina 💞💞💓💓😍😍#NagaChaitanya#shobithadhulipalapic.twitter.com/BfFw1hCc8p
డిసెంబర్ 4న వివాహం
నాగచైతన్య వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్థూడియోస్ లోని ఏఎన్నార్ విగ్రహం ముందు జరగనుంది. ఏఎన్నార్ ఆశీస్సులు కొత్త జంటపై ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు అక్కడ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. చై- శోభిత పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా 300 మందికి పైగా గెస్టులు హాజరు కానున్నట్లు సమాచారం.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
ఇది ఇలా ఉంటే.. నాగచైతన్యతో పాటు అతని తమ్ముడు అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అఖిల్ నవంబర్ 26న జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందట. జైనబ్ చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్, లండన్ లోనూ ప్రదర్శనలిచినట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్ లో పుట్టి ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. జైనబ్ తండ్రి జుల్ఫీ , నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!