Chaitu-Sobitha: ఆ శూన్యాన్ని ఆమె పూడుస్తుందంటున్న చైతూ! అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Bhavana 29 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Chaitu-Sobhitha: అక్కినేని ఇంట వారసుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల మరో ఐదురోజుల్లో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వారిఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి.తాజాగా ఈ జంట పెళ్లి వేడుకల్లోని హల్దీ వేడుక ఘనంగా జరిగింది. కొత్త జంటను ఒకే చోట ఉంచి ఈ వేడుక నిర్వహించారు. సంప్రదాయబద్దంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. Also Read: PASSPORT: రెండు రోజుల్లోనే పాస్పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి ఈ జంటకు మంగళస్నానాలు చేయించి బంధువులు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 4న చైతన్య- శోభిత వివాహం జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ పెళ్లి తంతు నిర్వహించనున్నారు. దీని గురించి ఇటీవల చైతన్య మాట్లాడారు. Also Read: మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు! శోభితతో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మా పెళ్లి చాలా సింపుల్ గా, సంప్రదాయబద్దంగా జరగనుంది.ఈ వేడుకల్లో ఆర్భాటాలకు ఎలాంటి అవకాశాలు లేవని చైతూ చెప్పారు. ఉత్సాహంగా పనులు జరుగుతున్నట్లు వివరించారు. అతిథులు, పెళ్లికి సంబంధించిన ఇతర విషయాలను ఇద్దరం కలిసి నిర్ణయిస్తున్నాం. Also Read: Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! హైదారబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. స్టూడియోలోని తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరగనుంది. ఆయన ఆశీస్సులు మా పై ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురు చూస్తున్నా. Also Read: Putin: ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు..పుతిన్ కీలక వ్యాఖ్యలు! తనతో నేనెంతగానో కనెక్ట్ అయ్యా. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తను పూడుస్తుందని నమ్ముతున్నాను అంటూ చైతూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. #wedding #naga-chaitanya #sobhita-dhulipala #Haldi Ceremony మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి