Nag Ashwin: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ 'కల్కి 2' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' 'కల్కి2' ఇప్పట్లో ఉండదు. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఓ మూడు సినిమాలు కలిపితే 'కల్కి2' తో సమానం. సో ఇంకో మూవీ షూటింగ్ చేసే అవకాశం లేదు..' అని చెప్పుకొచ్చారు.

fhhh
New Update


పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898AD'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వెయ్యి కోట్లు కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ అతిథి పాత్రలతో అలరించారు. 

Also Read :  పూర్ణ మ్యారేజ్ డే.. పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్

'కల్కి2' ఇప్పట్లో ఉండదు..

బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. తాజాగా ఓ ఈవెంట్‌లో భాగంగా నాగ్ అశ్విన్ ‘కల్కి2’మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిపారు.' 'కల్కి2' ఇప్పట్లో ఉండదు. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఓ మూడు సినిమాలు కలిపితే 'కల్కి2' తో సమానం.

Also Read : 'గేమ్ ఛేంజర్' కౌంట్ డౌన్ షురూ.. ట్రెండింగ్ లో కొత్త పోస్టర్

 సో ఇంకో మూవీ షూటింగ్ చేసే అవకాశం లేదు. పూర్తిగా కల్కి-2 కోసమే వర్క్ చేయాలనుకుంటున్నాను..' అంటూ పార్ట్-2 పై ఒక్కసారిగా హైప్ పెంచేశాడు. దీంతో నాగ్ అశ్విన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా గతంలోనూ 'కల్కి 2' గురించి నాగ్ అశ్విన్ మాట్లాడారు. 

Also Read :  చీరలో జూనియర్ అతిలోక సుందరి హొయలు ! ఫొటోలు చూస్తే ఫిదా

'కల్కి' సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్‌ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. వాటిని కొత్తగా ప్రారంభించాలి. ఈ సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌, ప్రభాస్‌, అమితాబ్‌ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య సన్నివేశాలు సినిమాకే కీలకం కానున్నాయని అన్నారు.

Also Read :  వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

#tollywood #prabhas #kalki-2898-ad #nag-ashwin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe