/rtv/media/media_files/2024/10/27/q1q1zU2NTTUJXUxWhzmz.jpg)
ఎఫ్2, ఎఫ్3 వంటి హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #Anil Venky 3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. దాన్నే దృష్టిలో పెట్టుకుని రేయింబవళ్లు కష్టపడిన మూవీ టీమ్ అప్పుడే చిత్రీకరణను దాదాపు పూర్తి చేసేసింది.
Also Read : జన్వాడలోని ఓ ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ
90 శాతం షూటింగ్ పూర్తి..
తాజాగా ఇదే విషయమై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ 90 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. అలాగే డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయని అందుకు సంబంధించి ఓ చిన్న వీడియో క్లిప్ వదిలారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంత త్వరగా తన సినిమా షూటింగ్ పూర్తి చేయడం ఇదే మొదటి సారి. మాములుగా ఈ దర్శకుడు తన సినిమా సినిమాకు మధ్య కనీసం ఏడాది గ్యాప్ అయినా తీసుకుంటాడు.
Also Read : డిసెంబరు నాటికి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ
#SVC58 DUBBING BEGINS 🎙️
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024
Team #VenkyAnil3 completed 90% of the shoot and post-production happening in full swing to entertain you all on the big screens 💥💥💥
TITLE & FIRST LOOK SOON ❤️🔥
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish… pic.twitter.com/BnEn2lPu2P
Also Read : ఆ విషయంలో కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్
కానీ ఈసారి మాత్రం అలాకాదు. చాలా తొందరగా తన నుంచి మరో సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనున్నారట. ఈ అప్డేట్ తో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈసారి సంక్రాంతికి అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. ఆయనకు జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేస్జ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?