/rtv/media/media_files/2024/10/27/t365ItFNaIJyCED4Ktgi.jpg)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అభిమానుల కోసం కౌంట్ డౌన్ షురూ అంటూ ఆసక్తికర పోస్టర్ ఒకటి విడుదల చేసింది.
Also Read : మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి-VIDEO
మరో 75 రోజుల్లో..
అందులో టీజర్ అప్డేట్ కూడా ఇచ్చింది.' 75 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పేలుడు శక్తి ఆవిష్కృతం కాబోతుంది. గేమ్ ఛేంజర్ టీజర్ బాణసంచా త్వరలో'.. అంటూ సూట్‌లో ఉన్న రాంచరణ్ కుర్చీపై కూర్చుండగా.. రౌడ్ గ్యాంగ్ అతడివైపు దూసుకొస్తున్న పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచింది. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుండగా.. పోస్టర్ అలా రిలీజ్ చేశారో లేదో అంతలోనే సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచింది.
7️⃣5️⃣ days until the Game begins! 🥁🔥#GameChanger on JANUARY 10th in the theatres worldwide 💥#GameChangerOnJAN10 🚁
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah @MusicThaman @actorsrikanth @yoursanjali @Naveenc212 @AntonyLRuben @DOP_Tirru… pic.twitter.com/BB8TpxPS3i
Also Read : ఆ విషయంలో కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్
దీపావళికి టీజర్..
ఇక తాజా అప్డేట్ లో 'గేమ్ ఛేంజర్ టీజర్ బాణసంచా త్వరలో..' అనే క్యాప్షన్ ను బట్టి టీజర్ దీపావళికి రాబోతున్నట్లు అర్థమవుతుంది. బహుశా లేటెస్ట్ పోస్టర్ కు సంబందించిన సీన్ కూడా టీజర్ లో ఉండొచ్చేమో చూడాలి. మరోవైపు ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ రెండు సాంగ్స్ విజువల్ గా ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయి.
Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥
— Game Changer (@GameChangerOffl) October 27, 2024
The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ
Also Read : వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఇది రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య సాగే మెలోడీ డ్యూయెట్ సాంగ్ అని సమాచారం. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు.
Also Read : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?