/rtv/media/media_files/2026/02/27/dhanush-2026-02-27-18-57-23.jpg)
తమిళ చిత్రసీమ(kollywood) లో గత కొద్దికాలంగా విడాకుల(divorce) పరంపర కొనసాగుతోంది. దశాబ్దాల కాలం కలిసి ఉన్న జంటలు సైతం విడిపోతుండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్(vijay) భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరూ 1999లో వివాహం(marriage) చేసుకున్నారు. 26 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విభేదాల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు (సంజయ్, దివ్య) ఉన్నారు. వీరితో పాటుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న సెలబ్రేటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Also Read : Hot Spot 2 Much: సీక్వెల్ వచ్చేసింది.. ఆహాలో 'హాట్ స్పాట్ 2 మచ్' స్ట్రీమింగ్..
ఏఆర్ రెహమాన్ - సైరా బాను :
2024 నవంబర్‌లో వీరిద్దరూ విడాకులు ప్రకటించారు. దాదాపు 29 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విభేదాల కారణంగా విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ : 2022లో వేరుగా ఉంటున్నట్లు ప్రకటించారు, 2024 నవంబర్‌లో చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.18 ఏళ్ల వివాహ బంధం తర్వాత వీరు విడిపోయారు. పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరూ కలిసే బాధ్యత తీసుకుంటున్నారు.
జయం రవి - ఆర్తి (2024-25) : 2024 సెప్టెంబర్‌లో జయం రవి విడాకులు ప్రకటిస్తే, అది ఏకపక్ష నిర్ణయమని ఆర్తి ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది.15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత విడిపోవాలని జయం రవి తీసుకున్న నిర్ణయం కోలీవుడ్‌లో వివాదాస్పదమైంది.
జి.వి. ప్రకాష్ - సైంధవి (2024) : 2024 మే నెలలో విడాకులు ప్రకటించారు. స్కూల్ రోజుల నుంచి స్నేహితులైన వీరు 11 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. పరస్పర అవగాహనతోనే విడిపోతున్నట్లు వెల్లడించారు.
కమల్ హాసన్ - వాణి గణపతి / సారిక : 1978లో వివాహం చేసుకున్న ఈ జంట 1988లో విడిపోయారు. 1988లో సారికను వివాహం చేసుకున్నారు. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. అయితే 2004లో వీరు కూడా విడాకులు తీసుకున్నారు.
ప్రభు దేవా - రమలత్ : ప్రభు దేవా తన భార్య రమలత్‌తో 15 ఏళ్ల బంధం తర్వాత 2011లో విడిపోయారు. ఆ సమయంలో నయనతారతో ఆయనకున్న ప్రేమాయణం పెద్ద సంచలనంగా మారింది. దీని కోసం ఆయన దాదాపు రూ. 25 కోట్ల వరకు భరణం ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ప్రకాష్ రాజ్ - లలిత కుమారి (2009) : వైవిధ్య నటుడు ప్రకాష్ రాజ్, నటి లలిత కుమారిని 1994లో వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా, మనస్పర్థల కారణంగా 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు.
రేవతి - సురేష్ చంద్ర మీనన్ (2013) : ప్రముఖ నటి రేవతి తన భర్త, సినిమాటోగ్రాఫర్ సురేష్ మీనన్‌తో 25 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. 1986లో పెళ్లి కాగా, 2013లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
అరవింద్ స్వామి - గాయత్రి రామ్మూర్తి (2010) : రోజా సినిమాతో స్టార్‌గా మారిన అరవింద్ స్వామి 1994లో గాయత్రిని వివాహం చేసుకున్నారు. 16 ఏళ్ల తర్వాత 2010లో వీరు విడిపోయారు. పిల్లల బాధ్యతను అరవింద్ స్వామి ఒక్కరే తీసుకున్నారు.
సెల్వరాఘవన్ - సోనియా అగర్వాల్ (2010) : దర్శకుడు సెల్వరాఘవన్, హీరోయిన్ సోనియా అగర్వాల్ ప్రేమించి 2006లో పెళ్లి చేసుకున్నారు. అయితే కేవలం 4 ఏళ్లకే 2010లో విడాకులు తీసుకున్నారు.
అమలా పాల్ - ఎ.ఎల్. విజయ్ (2017) : దర్శకుడు విజయ్, నటి అమలా పాల్ ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరు 2017లో విడాకులు తీసుకున్నారు.
Also Read : సైజ్ జీరోపై మృణాల్ ఠాకూర్ హాట్ కామెంట్స్ వైరల్!
Follow Us