/rtv/media/media_files/2025/02/15/OuuJcotzjf267CmXwCes.jpg)
Monalisa dance
Monalisa Dance Viral Video: కుంభమేళాలో పూసలు దండలు అమ్ముకునే మోనాలిసా ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నీలికళ్ళు, అమాయకపు చూపులతో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఆ ఒక్క వీడియోతో మోనాలిసా దశ తిరిగింది. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. హీరోయిన్ ఛాన్స్ తో సెలెబ్రెటీగా మారిన మోనాలిసా.. ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్ల సందడి చేయడం మొదలు పెట్టింది.
Also Read : Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో డాన్సులు
తాజాగా కేరళలోని ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో మోనాలిసా సందడి చేసింది. అక్కడ స్టేజ్ పై డాన్స్ పై యాంకర్ తో కలిసి డాన్స్ వేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mumbai pahuchi monalisa kera rehe hai jabrdasti item dance..... And makup for white face.#Monalisa #Bollywood #bollywoodactress #MumbaiRains pic.twitter.com/wHimvZb9G9
— Ajay kumar (@Ajaykum36701922) February 15, 2025
సనోజ్ మిశ్రా తెరకెక్కించనున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తెగా కనిపించనుంది. ప్రేమకథ, స్థానిక సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 కోట్లు బడ్జెట్‌తో సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాగా.. మోనాలిసా ఏప్రిల్ నుంచి షూటింగ్ లో పాల్గొననుంది.
Also Read: Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!