Kapoor Family: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!

కపూర్ ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దివంగత నటుడు రాజ్‌కపూర్‌ శత జయంతి సందర్భంగా మోదీతో కలిసి కుటుంబం అంతా ఫొటోలు దిగారు. ప్రధాని తన నివాసానికి తమను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తామని కరీనా కపూర్ చెప్పారు. 

author-image
By srinivas
New Update
ttetete

PM Modi : కపూర్ ఫ్యామిలీ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాజ్‌కపూర్‌ శత జయంతి సందర్భంగా మోదీతో కలిసి కుటుంబం అంతా ఫొటోలు దిగారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి కరీనా కపూర్.. ప్రధాని ఆటోగ్రాఫ్‌ తీసుకుని మురిసిపోయారు. కరీనా- సైఫ్‌ అలీఖాన్‌ దంపతులతోపాటు రణ్‌ బీర్ కపూర్-అలియా భట్‌ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 

Also Read: కేవలం 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

Also Read: ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజ్రీవాల్

ఈ ఆనందం ఎన్నటికీ మరుచిపోలేనిది.. 

ఇక ఈ విషయాన్ని అభిమానులో షేర్ చేసుకున్న కరీనా.. 'మా గ్రాండ్‌ఫాదర్‌ శత జయంతి సందర్భగా ప్రధాని మమ్మల్ని ఆహ్వానించారు. ఇది మేము గౌరవంగా భావిస్తున్నాం. మోదీ జీ.. మీకు కృతజ్ఞతలు. రాజ్ కపూర్ జయంతిని సెలబ్రేట్‌ చేసుకుంటున్న తరుణంలో మీరు మా కుటుంబానికి ఇచ్చిన మద్ధతు ఎన్నటికీ మరుచిపోలేనిది’ అంటూ మోదీకి కరీనా థ్యాంక్స్ చెప్పారు. 

Also Read: CM సీటుకు వాస్తు గండం..!  KCR, రేవంత్, జగన్, CBNల ట్రాక్‌లు ఇవే

ఇదిలా ఉంటే.. నటుడు, దర్శకుడు, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన రాజ్‌కపూర్‌.. 1924 డిసెంబర్ 14లో జన్మించి 1988లో మరణించారు. పద్మ భూషణ్‌, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ఇందులో భాగంగానే రాజ్‌కపూర్‌ జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘రాజ్‌కపూర్‌ 100: సెంటినరీ ఆఫ్‌ ది గ్రేటెస్ట్‌ షోమ్యాన్‌’ పేరుతో వేడుకలు జరగనున్నాయి. 40 నగరాల్లోని 135 థియేటర్లలో ‘ఆగ్‌’, ‘ఆవారా’, ‘శ్రీ420’, ‘సంగం’, ‘బాబీ’ లాంటి 10 చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆర్‌కే ఫిల్మ్స్, ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్, ఎన్‌ఎఫ్‌డీసీ సంస్థలు తెలిపాయి. 

Also Read: ఆత్మహత్యకు ముందు స్నానం..వందసార్లు శివనామస్మరణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు