/rtv/media/media_files/2025/02/03/GU3zAlsFGHN7892WD0Fq.jpg)
Mohan Babu and Manchu Manoj Rangareddy District Collectorate
Mohan Babu and Manchu Manoj
మోహన్‌బాబు, మంచు మనోజ్ ఆస్తి వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. ఇటీవల మోహన్‌బాబు ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతిమా సింగ్ మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. కాగా మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
జనవరి 18న ఫిర్యాదు
గత నెల జనవరి 18న మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొందరు అక్రమంగా దోచుకోవాలని చూస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. తన నివాసంలో ఉన్న వారందరినీ త్వరగా ఖాళీ చేసి తనకు అప్పగించాలని కోరారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం.. తన ఆస్తులను స్వాధీనం చేసి తనకు అప్పగించాలని కలెక్టర్‌ను కోరారు.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
దీంతో మోహన్ బాబు ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు. అనంతరం జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ తన లీగల్ టీమ్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. అక్కడ అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసారు.
కాగా ఈ ఆస్తి వివాదం గతేడాది ఒక ఎపిసోడ్‌లా నడిచింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా ఇది నడిచింది. మోహన్ బాబు ఇంటి మీదకి మంచు మనోజ్ తన బౌన్సర్లతో వెళ్లడం చూశాం. అలాగే మోహన్ బాబు సైతం తన కోపాన్ని ఆపుకోలేక ప్రముఖ టీవీ ఛానెల్ రిపోర్టర్‌పై కూడా దాడి చేసిన సంఘటనలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇలా తండ్రీ కొడుకుల వివాదం నడుస్తూనే ఉంది.