Miss World 2025: పిల్లల మర్రి, AIG హాస్పిటల్ ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.. వీడియోలు ఇక్కడ చూడండి.

మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని పురాతనమైన పిల్లల మర్రితో పాటు హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ ని సందర్శించారు. పిల్లల మర్రి దగ్గర అందాల భామలకు తెలంగాణ నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు.

New Update
miss world 2025 contestants visited AIG hospital

miss world 2025 contestants visited AIG hospital

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు తెలంగాణ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందాల పోటీల్లో పాల్గొనడంతో తెలంగాణలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. తెలంగాణ కల్చర్, హెరిటేజ్, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తోంది ప్రభుత్వం.

పిల్లల మర్రి, AIG హాస్పిటల్

ఇందులో భాగంగా ఈరోజు అందాల భామలు మహబూబ్ నగర్ జిల్లాలోని 700 సంవత్సరాల పురాతనమైన  మర్రి చెట్టు.. పిల్లల మర్రిని సందర్శించారు. అక్కడ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు తెలంగాణ నృత్య ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం టూరిస్ట్ గైడ్ అందాల భామలకు  పిల్లల మర్రి  యొక్క విశేషాలను వివరించారు. ఈ మర్రి చెట్టు  కొమ్మలు దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. తెలంగాణ అటవీశాఖ దేశంలోని పురాతనమైన వాటిలో ఈ మర్రి చెట్టును ఒకటిగా గుర్తించింది. 

Also Read :  ఐఫోన్ డిజైన్‌తో కొత్త ఫోన్.. కేవలం రూ.10 వేల లోపే!

Also Read :  అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు

మరో గ్రూప్ కంటెస్టెంట్స్ హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ ని సందర్శించారు. అక్కడ అందుబాటులో ఉన్న అధునాతన వైద్య సంరక్షణ సౌకర్యాల గురించి వారికి  వివరించారు.  AIG ఆసుపత్రి హైదరాబాద్‌  వైద్య పర్యాటక కేంద్రంగా ప్రదర్శించబడుతుంది. దేశ, విదేశాల్లో ఈ ఆస్పత్రికి మంచి పేరు ఉంది. 

Also Read :  ఆ స్టేడియంలో మళ్లీ ఆడాలనుంది.. రోహిత్ శర్మ ఎమోషనల్!

Also Read :  భారత్‌తో యుద్ధం చేసేందుకు చైనాతో కలిసి పాక్‌ కుట్ర !

telugu-news | latest-news | Miss World 2025 hyderabad

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు