The Girlfriend Movie: చున్నీ తీసేస్తే 'ఉమెన్ ఎంపవర్మెంటా?'.. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాపై నెటిజన్స్ ఫైర్!

‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ సక్సెస్ అందుకుంటుండగా, క్లైమాక్స్ చూసిన ఒక యువతి చున్నీ తీసేయడం వైరల్‌గా మారింది. దర్శకుడు ఆమెను అభినందించగా, నెటిజన్లు మాత్రం “ఇదేనా మహిళా సాధికారత?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

New Update
The Girlfriend Movie

The Girlfriend Movie

The Girlfriend Movie: దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల మంచి స్పందనను సంపాదిస్తోంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను పెద్దగా ఆదరిస్తుండటంతో, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.

ఐదు రోజుల్లో 20 కోట్ల గ్రాస్

గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన ఐదు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా దాదాపు రూ.20.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచి విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతలు, చిత్ర యూనిట్ ఈ సంఖ్యలను అధికారికంగా ప్రకటించారు.

సినిమా చూసిన ఒక యువతి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. సినిమా క్లైమాక్స్ ముగిసిన తర్వాత ఆమె దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసింది. “ఈ క్లైమాక్స్ చూసిన తర్వాత ఇది ధరించాల్సిన అవసరం లేదనిపిస్తోంది” అంటూ తన చున్నీని తీసేసింది. ఆమె చేసిన పనిపై రాహుల్ చప్పట్లు కొట్టి, ఆమెను అభినందిస్తూ కౌగిలించుకున్నారు కూడా.

సోషల్ మీడియాలో భారీ విమర్శలు

అయితే ఆ యువతి చేసిన చర్యపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీనిపై కఠినంగా స్పందిస్తున్నారు.
“మహిళా సాధికారత అంటే చున్నీ తీసేయడమా?”, “ఉమెన్ ఎమ్పవర్మెంట్‌ను ఇలా చూపడం సరైనదా?” అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

కొంతమంది మాత్రం ఆమె తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసిందని సమర్థిస్తున్నారు. అయినా పెద్ద సంఖ్యలో నెటిజన్లు “స్వేచ్ఛ, సాధికారతకు వేరే అర్ధం ఉంది” అని కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తం మీద… సినిమా విజయంతో పాటు, సినిమా ప్రభావంతో చేసిన ఈ చర్య కూడా చర్చనీయాంశంగా మారింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఇప్పటికే థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధిస్తుండగా, ఇప్పుడు ఈ ఘటన సినిమాకు మరింత ప్రచారం తీసుకొచ్చినట్టే కనిపిస్తోంది. ఈ సంఘటన కారణంగా సినిమా, మహిళల స్వేచ్ఛపై కొత్త చర్చలు మొదలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు