/rtv/media/media_files/2025/02/24/zuoYLTRE7VxIZMcaq9Fa.jpg)
MARCO Hero Unni Mukundan
Unni Mukundan: మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ మార్కో(MARCO) చిత్రంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు, యాక్షన్ హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారెజ్ సినిమాలో కూడా ఒక మంచి పాత్రను పోషించాడు. అయితే, రీసెంట్ గా వచ్చిన మార్కో మూవీతో మాత్రం ఉన్ని ముకుందన్ ఫుల్ ఫేమస్ అయ్యాడు.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
కోపంతో ఫోన్ లాక్కొని..
ఇప్పుడు, మార్కో (Unni Mukundan)కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఉన్ని ని ఫోటో తీసుకోవడం కోసం ఒక ఫ్యాన్ తన ఫోన్ ఉన్ని మొహం దగ్గరగా పెట్టాడు. దాంతో కోపం వచ్చిన ఉన్ని ఆ ఫోన్ లాక్కొని జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఈ వీడియోకు సంబంధించి పలు రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది, "కెమెరాను ముఖం మీద పెట్టడం తప్పు," అంటూ అభిప్రాయపడుతున్నారు, ఇక మరికొందరు, "హీరో తన అహంకారంతో ఫోన్‌ను తీసుకోవడం సరైంది కాదు," అని చెబుతున్నారు. కానీ, ఉన్ని ముకుందన్ ఎప్పుడూ ఇలాగే ఉంటాడని, అతని వ్యక్తిత్వమే అది అని మోలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.
Lol 😅 🤣🤣pic.twitter.com/qwLbyltVJN
— Milagro Movies (@MilagroMovies) February 22, 2025
సాధారణంగా సెలెబ్రిటీలకు ఈ రకమైన సంఘటనలు చాలా కామన్ ఎయిర్ పోర్ట్ లలో, సినిమా థియేటర్లలో తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. బాలయ్య లాంటి హీరోల దగ్గర అయితే ఇలాంటివి ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. ఫోన్ లాక్కొని విసిరేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ అయినా ఇలాంటి పనులు మానేసి కొంచెం పద్ధతిగా ఉంటె అందరికీ బెటర్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!
ఈ వీడియో కొత్తది కాదో, పాతది కాదో అన్న విషయం పై క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మార్కో చిత్రం ఓటీటీలో మంచి ట్రెండ్ అవుతోంది. మార్కో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మార్కో వంటి వయలెన్స్, యాక్షన్ సినిమాలు మాలీవుడ్ లో చాలా తక్కువ. ఈ చిత్రం 'కిల్' మూవీ కంటే కూడా బాగా వయోలెంట్ గా ఉందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!