Manchu Vishnu: భక్తి సినిమాలో రొమాన్స్ సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ వ్యాఖ్యలు!

కన్నప్ప సినిమాలో లవ్ సాంగ్‌పై మంచు విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘‘భక్త కన్నప్ప’లోనూ బెస్ట్‌ లవ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. 2వ శతాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉండేవి? విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారు. శివుడి పాటనూ విమర్శించిన వారున్నారు.’’ అని చెప్పాడు.

New Update
Manchu Vishnu makes shocking comments on love song in Kannappa movie

Manchu Vishnu makes shocking comments on love song in Kannappa movie

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కన్నప్ప’. అందరి చూపు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. ఇతర భాషల స్టార్ కాస్టింగ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ సహా మరెందరో నటీ నటులు ఇందులో భాగం అయ్యారు. దీంతో వీరందరినీ ఒకే స్క్రీన్‌పై చూసేందుకు తమ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే మంచు విష్ణు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి సందడి చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. ఇటీవల విడుదలైన ‘లవ్ సాంగ్’పై బాగా విమర్శలు వచ్చాయి. 

Also read :  రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

నేను సినిమా తీస్తున్నా

ఇదే అంశం ఇంటర్వూలో చర్చకు రాగా.. ‘భక్తి చిత్రంలో గ్రామర్ అవసరమా?’ అనే పాయింట్‌పై విష్ణు స్పందించాడు. ‘భక్త కన్నప్ప’ సినిమాలోనూ బెస్ట్ లవ్ సాంగ్స్ ఉన్నాయని అన్నాడు. 2వ శతాబ్దంలో బట్టలు ఏ విధంగా ఉండేవి?.. విమర్శించాలనే కోణంలోనే కొందరు చూస్తారని అన్నాడు. శివుడి పాటను కూడా చాలా మంది విమర్శించారు. వాటిని చూసి తనలో తాను నవ్వుకున్నానని అన్నాడు. తాను సినిమా తీస్తున్నానని.. డాక్యుమెంటరీ కాదని పేర్కొన్నాడు. అందుకే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలిపాడు. 

అదే సమయంలో కన్నప్ప సినిమా ఓటీటీ హక్కుల అమ్మకం పై కూడా మాట్లాడాడు. తాను పెట్టిన బడ్జెట్‌కు ఓటీటీకి అమ్మితే సేఫ్ కాలేనని తెలిపాడు. ఓటీటీ సంస్థలకు తన చిత్రాన్ని చూపించనని.. తమ మార్కెటింగ్ టెక్నిక్స్ వేరే ఉన్నాయని అన్నాడు. అయితే ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద రిస్క్‌గా భావిస్తున్నానని.. ఆ శివుడే కాపాడతాడనే నమ్మకంతో ఉన్నానని తెలిపాడు.

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు