Manchu Vishnu Kannappa: మంచు విష్ణుకు కోలుకోలేని దెబ్బ.. అలా జరిగితే ‘కన్నప్ప’కు భారీ నష్టాలు!

మంచు విష్ణుకు బిగ్‌షాక్ తగిలింది. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మాయమవడంతో టెన్షన్ మొదలైంది. అందులోని సమాచారం బయటకు వస్తే సినిమాకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. త్వరలో రిలీజ్ కానున్న కన్నప్పకు ఇది పెద్దషాకే.

New Update

మంచు విష్ణుకు గట్టి షాక్ తగిలింది. మరికొద్ది రోజుల్లో ‘కన్నప్ప’ రిలీజ్ కానుండగా.. దానికి సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. దీంతో ఫిలిం నగర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ మేరకు తమ అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ తీసుకెళ్లినట్లు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడిదే వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక షాక్ తగులుతూనే ఉంది. ముఖ్యంగా నటుడు మంచు విష్ణుపై ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

అతడిపై తరచూ ఏదో ఒక మీమ్స్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా మంచు విష్ణుకి పెద్ద దెబ్బే తగిలింది. కన్నప్ప మూవీపై బజ్ తెచ్చేందుకు మంచు విష్ణు విదేశాల్లో సైతం ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్‌ డ్రైవ్‌ మాయం కావడంతో విష్ణుకి గట్టి షాక్ తగిలింది. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

హార్డ్ డ్రైవ్‌లో సమచారం బయటకు వస్తే

ఒకవేళ హార్డ్ డ్రైవ్‌లో ఉన్న సమాచారం మొత్తం బయటకు వస్తే మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రానికి ఎవరూ ఊహించని షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రం మొదలైనపుడు బడ్జెట్ రూ.100 కోట్లే అని అన్నారు. కానీ రిలీజ్ టైంకి లెక్క రూ.200 కోట్లు దాటిపోతోందని ఇటీవల మంచు విష్ణు ఓ సందర్భంలో తెలిపాడు. అందువల్ల ఈ సినిమాకి సంబంధించిన డ్రైవ్‌లోని సమాచారం బయటకు వస్తే.. నష్టాల్లో కూరుకుపోవడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా నుంచి కూడా ఓ సాంగ్ మొత్తం లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీకి సంబంధించి ఏకంగా హార్డ్ డ్రైవ్ మిస్ కావడంతో చిత్రబృందంలో టెన్షన్ మొదలైంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

Manchu Vishnu | kannappa | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు