మంచు విష్ణు అండ్ టీమ్ ప్రస్తుతం ఫుల్ టెన్షన్‌లో ఉంది. అతడు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలోని కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ దొంగలించబడింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ తరుణంలో హార్డ్ డ్రైవ్ చోరీకి గురవ్వడంతో చిత్రబృందం ఆందోళన చెందుతుంది. ఒకవేళ ఆ హార్డ్ డ్రైవ్‌లోని సమాచారం బయటకు వస్తే ఇంతకాలం పడిన శ్రమ వృథా అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
నాకెందుకీ పరీక్ష
ఈ ఘటనపై ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా గడుపుతున్న మంచు విష్ణుకు ఇదొక కొత్త తలనొప్పిగా మారింది. దీంతో మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆ పరమ శివుడిని ప్రశ్నిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టాడు. ‘జటాజూఠధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’.. హరహర మహాదేవ్’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో మంచు విష్ణుకు ఎదురైనా పరిస్థితిని చూసి అభిమానులు ధైర్యం చెబుతున్నారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH
— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025
ఏం జరిగిందంటే?
కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. కాగా కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను ముంబైకి చెందిన వీఎఫ్‌ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్‌లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. కాగా డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. డీటీడీసీ కొరియర్ వచ్చిన సమయంలో ఆఫీస్‌బాయ్ రఘు దాన్ని అందుకున్నాడు. అయితే అతను దాన్ని చరిత అనే మహిళకు అప్పగించాడు.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
కాగా హార్డ్ డ్రైవ్ వచ్చిన విషయం తెలుసుకున్న కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్‌డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్‌డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, చరిత, రఘులు కావాలనే కొంతమంది ప్రమేయంతో తమ సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నిసార్లు వారిని సంప్రదించిన లాభం లేకపోవడంతో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
Manchu Vishnu | latest-telugu-news | telugu-news