సంధ్య థియేటర్ ఘటనలో టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నేటి ఉదయమే బన్నీ మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యాడు. ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా తరలివస్తున్నారు.
Also Read : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!
వెల్‌కమ్ బ్యాక్ అల్లు అర్జున్..
ఏపీ సీఎం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫోన్ చేసి అల్లు అర్జున్ తో మాట్లాడారు. తాజాగా మంచు మనోజ్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించాడు." మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్.. వెల్‌కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
Also Read : అల్లు అర్జున్ కపుల్‌ని చూసి ఏడ్చిన సమంత..! ఇన్స్టా పోస్ట్ వైరల్
Motham Dhisti antha poyindhi Babai. Welcome back! @alluarjun garu.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 14, 2024
I truly admire your calm composure and your unwavering sense of responsibility during such a difficult time. Your timely response in supporting the affected family speaks volumes about your character.
The tragic…
ఇది కూడా చదవండి: రేవంత్-అల్లు అర్జున్ పబ్లిసిటీ స్టంట్.. కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్
బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తానని మీరు ఇచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నిజంగా హృదయ విదారకం. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. మీ కుటుంబానికి మరింత శాంతి, సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా.." అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీంతో మనోజ్ పెట్టిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
జైలు నుంచి వచ్చాక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. '' ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నా. అన్ని విధాలుగా అండగా ఉంటా. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తా. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు. ప్రమాదవశాత్తూ జరిగింది.." అని అన్నాడు.
ఇది కూడా చదవండి: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి