TG Crime: బ్యాంక్ గోడకు కన్నం.. కనిపెట్టిన కాంట్రాక్టు ఉద్యోగి

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దొంగలు చోరీకి యత్నించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బ్యాంకు లోపలికి వెళ్ళే ముందే సైరన్ మొగటంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
thief

TG Crime

TG Crime: ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువైపోయారు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే గోల్‌లో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దొంగతనాలు, చోరీలు, హత్యలు చేయడం ఇలా డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా అదిలాబాద్‌లో దొంగల ముఠా కలకలం రేపింది. డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. ఈ ఘటన తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటుచేసుకుంది.

సైరన్ ఒక్కసారిగా మోగటంతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉన్నది. గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ముఖానికి మాస్కులు, కళ్లద్దాలు పెట్టుకొని దొంగల బ్యాచ్‌ బ్యాంకు వైపు వచ్చారు బ్యాంక్‌ వెనుక భాగంలో గోడకి కన్నం పెట్టారు. తర్వాత ఒక దొంగ బ్యాంకు లోపలికి వెళ్ళకముందే కర్ర సహాయంతో లోపల ఉన్న లాకర్ను కదిలించాడు.

ఈ సమయంలో సైరన్ మోగుతుందా..? లేదా..? అని గుర్తించే ప్రయత్నాలు చేశారు. మొదట సైరన్ మోగకపోవడంతో దొంగ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో సైరన్ ఒక్కసారిగా మోగింది. దీంతో భయపడిన దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. ఆ సమయంలో బ్యాంకుకు సమీపంలో తాత్కాలిక ఉద్యోగికి అనుమానం వచ్చి అక్కడికి వెళ్లి చూశారు. సైరన్‌ మోగిందని వెంటనే పోలీసులకు, బ్యాంకు అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. 

Also Read:  రేవంత్‌-అల్లు అర్జున్‌ పబ్లిసిటీ స్టంట్‌.. కేంద్రమంత్రి షాకింగ్‌ కామెంట్‌

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. దొంగల ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఉదయం మరొకసారి వచ్చి విచారణ చేశారు. అనంతరం బ్యాంకులోని సిసి ఫుటేజీని పరిశీలించి.. చుట్టుపక్కల తనిఖీలు చేశారు. దొంగలకు సంబంధించిన చెప్పులు పొలంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటన జరగడానికి కారణం బ్యాంకు గ్రామ శివారులో ఉండటం వలన ఇలా జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చోరీకి వచ్చిన వారిలో ఎక్కువ మందే ఉన్నట్లు పోలీసులు వెల్లండిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు