Ustaad Bhagat Singh: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" సినిమాకు మొదట విలన్ పాత్రకు మల్లా రెడ్డిని సంప్రదించారు. రూ.3 కోట్లు ఆఫర్ వచ్చినా, విలన్ ని హీరో తిట్టి, కొట్టే సీన్లు ఉండడంతో ఆయన ఆ పాత్రను తిరస్కరించారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు చివరి దశ చిత్రీకరణలో ఉంది. హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పాత్ర షూటింగ్ ను పూర్తి చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల(Sree Leela) నటిస్తుండగా, రాశి ఖన్నా(Raashi Khanna) మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.

Malla Reddy in Ustaad Bhagat Singh..?

ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో విలన్ పాత్రకు మొదట దర్శకుడు హరీష్ శంకర్ తెలంగాణ రాజకీయ నాయకుడు మల్లా రెడ్డి(Malla Reddy) గారిని సంప్రదించారు. దీన్ని మల్లా రెడ్డి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇటీవల దసరా వేడుకల సందర్భంగా కుటుంబంతో కలిసి మాట్లాడుతున్న సమయంలో, ఆయన తనకు వచ్చిన సినిమాల ఆఫర్లు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Also Read: పాముల భయంతో బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న హీరో!

మల్లా రెడ్డి మాట్లాడుతూ, "హరీష్ శంకర్ మా కాలేజీకి వచ్చి విలన్ పాత్ర గురించి ఒక గంట పాటు చెప్పాడు. నాకు రూ.3 కోట్లు పారితోషికంగా అనుకున్నట్టు చెప్పారు. కానీ నన్ను విలన్‌గా చూడడం నాకెంతో ఇబ్బంది అనిపించింది."

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

అయితే దీనికి కారణం కూడా ఆయన చెప్పారు. "ఇంటర్వెల్ వరకూ నేను హీరోను తిట్టాలి. తర్వాత హీరో నన్ను తిట్టాలి, కొట్టాలి. అది నాకు ఇష్టం లేదు కాబట్టి తిరస్కరించాను" అని స్పష్టంగా చెప్పారు.

ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు మల్లా రెడ్డిని తమిళ హీరో విజయ్ నటించిన 'థెరి'లో నటించిన విలన్ మహేంద్రన్ గారితో పోల్చుతున్నారు. మొదట ఈ సినిమా 'థెరి'లో రీమేక్‌గా మొదలైనా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓ ఒరిజినల్ కథగా రూపొందుతోంది.

Also Read: మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం

పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మాస్ సినిమాలకు స్పెషలిస్టు అయిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, పవన్ అభిమానులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి!

Advertisment
తాజా కథనాలు