Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ల కంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారంలోకి అడుగుపెట్టింది. నాల్గవ వారం భారీ అంచనాలతో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాస్క్ మ్యాన్ అలియాజ్ హరిత హరీష్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. మొదటి రెండు వారాలు టాస్కులు, ఆర్గుమెంట్స్ లో యాక్టీవ్ గా కనిపించిన మాస్క్ మ్యాన్.. గత రెండు వారాలుగా సైలెంట్ అయిపోయాడు. హౌజ్ లో, నామినేషన్ ప్రక్రియలో ఇతర కంటెస్టెంట్స్ తో జరిగిన గొడవలను మనసులో పెట్టుకొని ఒక బీన్ బ్యాగ్ కి పరిమితం అయిపోయాడు. గొడవలను క్యారీ ఫార్వార్డ్ చేస్తూ ఎవరితో మాట్లాడకపోవడం, అందరూ తప్పూ తానే రైట్ అన్నట్లుగా ప్రవర్తించాడు. అలాగే కొన్ని సందర్భాల్లో తన పాస్ చేసిన స్టేట్మెంట్స్ తానే కాంట్రడిక్ట్ చేసుకోవడం జనాలకు అతడిపై చిరాకు తెప్పించింది. ఇవే అతడి ఓటింగ్ పడిపోవడానికి కూడా ప్రధాన కారణాలని ప్రేక్షకుల అభిప్రాయం.
లేటెస్ట్ ప్రోమో..
ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. కంటెస్టెంట్స్ నవ్వులతో మొదలైన ఈ ప్రోమో చివరికి ఎమోషనల్ గా మారింది. ముందుగా ప్రోమోలో ఇమ్మాన్యుయేల్- తనూజ ఒకరినొకరు క్యూట్ గా ఫ్లర్ట్ చేసుకుంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత తనూజ ఇమ్మాన్యుయేల్ తో.. నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది.. ఆమె ఫేస్ తలుచుకుంటేనే ఏడుపోసిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తనూజ తన ఫ్యామిలీని గుర్తుచేసుకొని ఏడవడంతో.. మిగతా హౌజ్ మేట్స్ కూడా తమ ఫ్యామిలీస్ ని గుర్తుచేసుకొని ఏడవడం మొదలు పెట్టారు. శ్రీజ, సుమన్ శెట్టి, సంజన, కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో బిగ్ బాస్ హౌజ్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది.
Also Read: Actor Sai Kiran: గుడ్ న్యూస్ చెప్పిన 'గుప్పెడంత మనసు' హీరో.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!!
అందరూ డేంజర్ జోన్
ఈ వారం ఇమ్మాన్యుయేల్, కెప్టెన్ రాము రాథోడ్ తప్పా.. మిగిలిన కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ లో ఉన్నారు. దీంతో ఈసారి అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే అని తెలుస్తోంది. అంతేకాదు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉండడంతో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందడానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రెండు జంటలుగా విడిపోయి టాస్క్ లో పాల్గొనాలని తెలిపారు. ఈ టాస్క్ లో గెలిచిన టీమ్ సభ్యులు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందుతారని చెప్పాడు. మరి ఈ టాస్కులో గెలిచి ఇమ్యూనిటీ పొందిన ఆ టీమ్ ఎవరో తెలియాలంటే నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రోమో ప్రకారం ఈ టాస్కులో భరణి- తనూజ టీమ్ గెలిచినట్లుగా తెలుస్తోంది.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!