Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఎక్స్ వేదికగా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ''అలలికా కదలక భయపడేలే... క్షణక్షణమొక తల తేగి పడేలా ... ప్రళయము యెదురుగ నిలబడలె.. మేటి ధాటికి లోకం హడలే…#OG 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం'' 🔥🔥అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. విడుదలైన మొదటి పది రోజుల్లో దేశవ్యాప్తంగా రూ. 178. 65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 308 కోట్లు కలెక్ట్ చేసింది.
Alalika Kadhalaka Bhayapadele…
— DVV Entertainment (@DVVMovies) October 5, 2025
Kshanakshanamoka Thala Thegi Padele…
Pralayamu Yedhuruga Nilabadele..
Meti Dhaatiki Lokam Hadale…#OG is the highest grossing Telugu Film of 2025 🔥🔥🔥🔥#TheyCallHimOG#BoxOfficeDestructorOGpic.twitter.com/TGQYcilw3C
అత్యధిక వసూళ్లు
గత నెల సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదలైన 'ఓజీ' మొదటి వారాంతం వరకు బలమైన వసూళ్లు కొనసాగించింది. ప్రతీ రోజు వసూళ్ళలో గమనీయమైన పెరుగుదలను కనబరిచింది. 2025 ప్రారంభంలో విడుదలైన వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తర్వాత రూ. 300 కోట్ల మార్క్ దాటిన చిత్రంగా పవర్ స్టార్ 'ఓజీ' నిలిచింది. 'సంక్రాంతికి వస్తున్నాం' రూ. 300 కోట్లు వసూలు చేయగా.. ఓజీ రూ. 308 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్ల సినిమాలేమి లేకపోవడం దీనికి ఒక కారణమని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో పవర్ స్టార్ స్టైల్, మాస్ ఎలివేషన్స్, స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించాయి. రికార్డు స్థాయిలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా కూడా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సినిమా వచ్చిందని సంబరాలు చేసుకున్నారు అభిమానులు. 'అత్తారింటికి దారేది' తర్వాత దాదాపు 12 ఏళ్లకు మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టారు పవన్ కళ్యాణ్.
Also Read: Bigg Boss Telugu: బిగ్ ట్విస్ట్! అందరూ డేంజర్ జోన్లో .. ఏడుస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్లు!