Cinema: పాముల భయంతో బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న హీరో!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు  ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం కామన్. అలా కొందరు హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు.

New Update
allari naresh

allari naresh

Cinema: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు  ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం కామన్. అలా కొందరు హీరోలు మిస్ చేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బ్లాక్ బస్టర్ సినిమా వదులుకున్న హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు. 2014లో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ'  చిత్రం అల్లరి నరేష్ చేయాల్సిందట. కానీ, అల్లరి నరేష్ నో చెప్పడంతో ఆ కథ నిఖిల్ కి వెళ్ళింది. అయితే అల్లరి నరేష్  భయంతో 'కార్తికేయ'కథకు నో చెప్పారట. మరి సినిమాలో అల్లరి నరేష్ ను అంతగా భయపెట్టిన విషయమేంటో తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

బ్లాక్ బస్టర్ మిస్ 

అయితే డైరెక్టర్ చందూ మొండేటి కార్తికేయ కథను ముందుగా అల్లరి నరేష్ కు వినిపించారట. ఆయనకు కూడా కథ బాగా నచ్చిందట. కానీ, ఒక్క కారణంతో నరేష్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. అదేంటంటే ఈ సినిమాలో పాములు, పాములకు సంబంధించిన సన్నివేశాలు ఉండడం!  సుబ్రమణ్యపురం అనే గ్రామంలోని  సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పాములు ఎక్కువగా కనిపించిన సంగతి తెలిసిందే.  హీరో- పాముల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి. చెప్పాలంటే.. ఆ సన్నివేశాలే సినిమాకు కీలకం అని చెప్పొచ్చు.  అయితే అల్లరి నరేష్ కి వ్యక్తిగతంగా పాములు అంటే భయం ఉండడం వల్ల సినిమా చేయడానికి తిరస్కరించారట. అలా అల్లరి నరేష్ వదులుకున్న  'కార్తికేయ' నిఖిల్ కి బ్లాక్ బస్టర్ అయ్యింది.   ఈ విషయాన్ని అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా పంచుకున్నారు. 

Also Read: Vijay Devarakonda: అయ్యో మొన్న నిశ్చితార్థం.. ఈరోజు యాక్సిడెంట్.. నేను సేఫ్ అటున్న రౌడీ హీరో

Advertisment
తాజా కథనాలు