Legendary Actor: లెజెండరీ నటుడు జీన్‌ హ్యాక్‌మ్యాన్‌ అనుమానాస్పద మృతి!

లెజెండరీ హాలీవుడ్‌ నటుడు జీన్‌ హ్యాక్‌మ్యాన్‌ అనుమానాస్పద మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో ఆయనతోపాటు ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.  హాక్‌మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63.

New Update
Hollywood actor

లెజెండరీ హాలీవుడ్‌ నటుడు (Hollywood Actor) జీన్‌ హ్యాక్‌మ్యాన్‌ (Gene Hackman) అనుమానాస్పద మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో ఆయనతోపాటు ఆయన భార్య, పెంపుడు శునకం చనిపోయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.  హాక్‌మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63.  జీన్ హాక్‌మన్, అతని భార్య ఇద్దరూ బుధవారం మధ్యాహ్నం సన్‌సెట్ ట్రైల్‌లోని వారి నివాసంలో చనిపోయారని నిర్ధారించామని పోలీసులు చెబుతున్నారు. అయితే వీరి మరణానికి కచ్చితమైన కారణాన్ని చెప్పలేమని అన్నారు.  

Also Read :  ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్

Also Read :  హిందీ వల్ల 25 నార్త్ ఇండియా భాషలు నాశనమయ్యాయి: స్టాలిన్

రెండు ఆస్కార్ అవార్డులు

1930లో జన్మించిన మిస్టర్ హాక్‌మన్ 100కి పైగా పాత్రలు పోషించారు. ఆయన నటనకు గానూ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు. - ఫ్రెంచ్ కనెక్షన్‌లో జిమ్మీ "పొపాయ్" డోయల్ పాత్రకు ఉత్తమ నటుడిగా..  అన్‌ఫర్గివెన్‌లో లిటిల్ బిల్ డాగెట్ పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా ఈయన ఆస్కార్ ఆవార్డు అందుకున్నారు. మొదట ఫేయ్ మాల్టీస్‌ను పెళ్లి చేసుకున్నారు హ్యాక్‌మ్యాన్‌. ఈ జంటకు  క్రిస్టోఫర్ అలెన్, ఎలిజబెత్ జీన్,  లెస్లీ అన్నే హాక్‌మాన్ ఆనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1986లో మూడు దశాబ్దాల వైవాహిక జీవితం తరువాత హ్యాక్‌మ్యాన్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హాక్‌మాన్ 1991లో పియానిస్ట్ బెట్సీ అరకావాను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు.

Also Read :  కోమాలో భారతీయ విద్యార్థిని.. తండ్రి అత్యవసర ప్రయాణం కోసం కేంద్రం సాయం!

Also Read :  పెళ్ళిలో AI తో చనిపోయిన అన్న వీడియో.. కుటుంబమంతా ఎలా ఏడ్చేసిందో చూడండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు