Viral Video: AI మరో అద్భుతం.. సోదరుడి పెళ్లిలో చనిపోయిన అన్న.. ఎమోషనల్ వీడియో!

పెళ్ళిలో అన్నయ్య లేడనే లోటును సోదరుడికి, పెద్ద కొడుకు లేని లోటును ఆ తల్లికి తీర్చింది AI. శారీరకంగా పెళ్లి వేడుకల్లో లేకపోయినా AI రూపంలో వీడియోలో కనిపించాడు. దీంతో ఆ తల్లి కళ్ళలో కన్నీరు ఆగలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 

New Update
ai video viral

ai video viral

Viral Video:  ఓవైపు AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలు సృష్టిస్తూ దారుణాలు చేస్తుండగా.. అదే AI టెక్నాలజీ కాలం చేసిన కొడుకును తల్లి ముందుకు తీసుకొచ్చి.. ఆమెలో క్షణం పాటు ఆనందం నింపింది. వివాహ వేడుకల్లో ఒక చోట శూన్యంగా ఉన్న హృదయాలు ఒక్కసారిగా ఆనందంతో కన్నీరు కార్చాయి. తన పెళ్ళిలో అన్నయ్య లేడనే లోటును సోదరుడికి, పెద్ద కొడుకు లేని లోటును ఆ తల్లికి తీర్చింది AI. శారీరకంగా పెళ్లి వేడుకల్లో లేకపోయినా AI రూపంలో వీడియోలో కనిపించాడు. చనిపోయిన కొడుకును AI ద్వారా మళ్ళీ బ్రతికొచ్చినట్లుగా చూడగానే ఆ తల్లి కళ్ళలో కన్నీరు ఆగలేదు. 

Also Read: Lucky Baskhar: ఇదేం క్రేజ్ రా బాబు.. 'లక్కీ భాస్కర్' ఎక్కడ వదలట్లేదు.. నెట్ ఫ్లిక్స్ లో మరో రికార్డు

 AI వీడియోతో పెళ్ళిలో చనిపోయిన 

అయితే ఇటీవలే జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో కుటుంబానికి తన కొడుకు లేడనే లోటును తీర్చడానికి.. అతడి AI వీడియోను క్రియేట్ చేసి ప్లే చేశారు. చనిపోయిన తమ కొడుకు సోదరుడి పెళ్ళిలో ఉన్నట్లు, తల్లిదండ్రులు, కుటుంబంతో కలిసి ఫొటోలు  దిగినట్లుగా AI వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో చూడగానే అతడిని గుర్తుచేసుకొని ఒక్కసారిగా  కుటుంబమంతా కన్నీళ్లు పెట్టుకుంది. ఒక్కసారైనా కొడుకును ఆలింగనం చేసుకోవాలనుకుంది  తల్లి.. మళ్ళీ తన అన్న తిరిగొస్తే బాగుండు అనుకున్నాడు ఆ పెళ్ళికొడుకు. వీడియో  AI మాయాజాలమైన ఆ ప్రేమ మాత్రం నిజమైనది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Also Read: Sreeleela: బాలీవుడ్ లో శ్రీలీల డిమాండ్ మామూలుగా లేదుగా.. తొలి సినిమాకే అన్ని కోట్లా!

Also Read:AI: ఇక మనుషుల అవసరం ఉండదేమో!.. సీక్రెట్‌ భాషలో మాట్లాడుకుంటున్న రెండు ఏఐ అసిస్టెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు