/rtv/media/media_files/2025/02/21/AZKWdnerpboRpOpQPt9s.jpg)
Lavanya tripati
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. పెళ్ళైన ఏడాది తర్వాత 'సతీలీలావతి' అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. రెండు వారాల క్రితం పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ షేర్ చేశారు లావణ్య త్రిపాఠి.
Also Read: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
Also Read: డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్.. అదుపు తప్పిన కంటైనర్.. ఒకరు మృతి
త్వరలోనే..
'సతీలీలావతి'(Sati Leelavati movie) ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. వేసవి ఫన్ రైడ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్రబృందం ఫొటోను పంచుకుంది. దీంతో త్వరలోనే సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్థూడియోస్ బ్యానర్ పై నాగ మోహన్ బాబు, రాజేష్. టి నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న మొదటి చిత్రమిది. ఆ మధ్య 'మిస్ పర్‌ఫెక్ట్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సీరీస్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'సతీలీలావతి' ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు.
Also Read: NTR- Prashanth Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి కిక్కెకించే ఫొటో.. ప్రశాంత్ నీల్ యాక్షన్ షురూ..!
లావణ్య 'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాతోనే క్యూట్ నెస్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య వరుస అవకాశాలు దక్కించుకుంది. అలా మెగా హీరో వరుణ్ తో కలిసి రెండు సినిమాలు చేసిన సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ 2023లో వివాహం చేసుకున్నారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వరుణ్- లావణ్య కలిసి నటించారు.