/rtv/media/media_files/2025/02/20/goljxFALTreiy9zME4fM.jpg)
ntr- Prashanth neel shoot begins
NTR- Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో #NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. అయితే 2024లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ క్రమంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!
#NTRNeel షూటింగ్ షురూ
#NTRNeel షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మొదటి రోజు షూటింగ్ నుంచి ఓ చిత్రాన్ని పంచుకున్నారు. #NTRNeel షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది అనే క్యాప్షన్ తో నీల్ సెట్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో జరుగుతున్న ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గోన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు.
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
పుష్ప2(Pushpa 2) తో బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో రుక్మిణీ వసంత్(Rukmini Vasant) కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2(NTR War 2), దేవర పార్ట్ 2(Devara Part 2) చిత్రాలతో బిజీగా ఉన్నారు. వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?