Laapataa Ladies: లపతా లేడీస్కు మరో అరుదైన ఘనత.. ఆస్కార్‌ మూవీతో పోటీ!

లపతా లేడీస్ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు ఈ చిత్రం ఎంపికైంది. మార్చి 14న జరగనున్న అవార్డుల వేడుకలో బెస్ట్ ఇంటర్నేషనల్ చిత్రంగా విజేతలను అనౌన్స్ చేయనున్నారు.

New Update
laapataa ladies shortlisted best international film

laapataa ladies shortlisted best international film

Laapataa Ladies: కిరణ్ రావు తెరకెక్కించిన ‘లపతా లేడీస్’ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు బద్దలు కొట్టింది. ఎన్నో రికార్డులను సైతం వెనక్కి నెట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో నితాన్జీ గోయల్, ప్రతిభా రంతా, ఛాయా కదమ్‌, స్పర్శ్‌ శ్రీవాస్తవ, రవి కిషన్‌ కీలక పాత్రల్లో నటించి అదరగొట్టేశారు. 

Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!

లపతా లేడీస్ అరుదైన ఘనత

ఈ చిత్రానికి ఇప్పటికి ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు వరించాయి. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించనుంది. లపతా లేడీస్ చిత్రం తాజాగా జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్ 2024కు ఎంపికైంది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో పోటీలో నిలబడింది. 

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!

ఈ పోటీలో హాలీవుడ్ ఆస్కార్ చిత్రం అయిన 'ఓపెన్‌హైమర్‌’ కూడా ఉంది. దీనితో పాటు ‘పూర్‌ థింగ్స్‌, 'సివిల్ వార్', 'ది జోస్ ఆఫ్ ఇంట్రెస్ట్' వంటి హాలీవుడ్ సినిమాలకు పోటీగా లపతా లేడీస్ చిత్రం నిలిచింది. దీంతో అందరి కళ్లు ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ ప్రైజ్‌కు అర్హత సాధించిన సినిమాల్లో భారత్ నుంచి ఈ చిత్రం నిలిచింది. మార్చి 14న జరగనున్న అవార్డుల వేడుకలో బెస్ట్ ఇంటర్నేషనల్ చిత్రంగా విజేతలను అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు