/rtv/media/media_files/2025/09/01/husband-pours-acid-on-wife-2025-09-01-12-26-10.jpg)
Husband Pours Acid On Wife
Husband kills Wife : భార్యభర్తల మధ్య అన్యోన్యాలు కొరవడి ఇప్పుడన్ని అనుమానాలే మిగులుతున్నాయి. మనుషులు ఎదుటి వారి గుణాన్ని పక్కనపెట్టి రంగు, డబ్బు, ఆస్తి పస్తులనే పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో పచ్చని కాపురాలు కుప్పకూలుతున్నాయి. కట్టుకున్న భార్య నల్లగా ఉందని ఓ ప్రభుద్ధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఆమె శరీరంపై యాసిడ్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తనువు చాలించింది. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి, కిషన్ భార్యా భర్తలు. పెళ్లయిన తర్వాత నుంచి కిషన్ తన భార్య లక్ష్మితో రంగు విషయంలో గొడవపడుతూ వస్తున్నాడు. నల్లగా ఉన్నావంటూ వేధిస్తూ వస్తున్నాడు. రోజు రోజుకు కిషన్ వేధింపులు ఎక్కువవుతున్నాయో కానీ తగ్గడం లేదు. అయినా భర్త ఎంత తిట్టినా, కొట్టినా లక్ష్మి మౌనంగా భరిస్తూ వస్తోంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది.
Also Read: దారుణం.. ఆస్తిలో వాటా ఇవ్వాలని.. 7 నెలల గర్భిణిని హత్య చేసిన కొడుకులు!
లక్ష్మీ మౌనాన్ని కిషన్ చేతకాని తనంలా తీసుకున్నాడు. దీంతో కిషన్ తన వేధింపుల్ని మరింత పెంచాడు. కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి కిషన్ తన భార్యను పిలిచాడు. ‘నీ కోసం ఓ మందు తెచ్చా. అది నీ శరీరానికి రాసుకుంటే తెల్లగా అవుతావు’ అని నమ్మించాడు. లక్ష్మికి అనుమానం రావడంతో దాన్ని వాసన చూసింది. అది యాసిడ్ వాసన రావడంతో. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతడు మాత్రం ఆమె మాటల్ని వినే పరిస్థితిలో లేడు. బలవంతంగా దాన్ని ఆమె శరీరానికి రాసుకునేలా చేశాడు. పూర్తిగా యాసిడ్ లక్ష్మీ తన శరీరానికి రాసుకున్నది. దీంతో కిషన్ అగరబత్తీ తీసుకుని ఆమె పొట్టపై కాల్చాడు. అంతే.. భగ్గున మంటలు అంటుకున్నాయి.
Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI
ఆ మంటలకు లక్ష్మీ కాలిపోతూ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది. కిషన్ ఆమెను రక్షించాల్సిందిపోయి మిగిలిన యాసిడ్‌ను కూడా ఆమె శరీరంపై పోశాడు. దీంతో ఆమె మంటల్లో కాలి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తిగా కాలిన లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కిషన్‌ను అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, అతడిని అడిషినల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న జడ్జి సంచలన తీర్పునిచ్చారు. నిందితుడికి మరణ శిక్ష విధించారు.
Also Read: మెట్రో సీటు కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్..!