Droupadi Murmu : నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి.సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ హర్షవర్ధన్ శింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ ను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది

New Update
rajyasabha

రాష్ట్రపతి ముర్ము నలుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేశారు. హై ప్రొఫైల్ క్రిమినల్ కేసులు వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి.సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ హర్షవర్ధన్ శింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ ను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభలో త్వరలో ఖాళీ అయ్యే స్థానాల్లో వీరిని భర్తీ చేస్తారు.  

Also Read :  బిహార్‌ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఓటర్ల జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్‌ పౌరులు

President Nominates Ex-Diplomat - Public Prosecutor To Rajya Sabha

Also Read :  మళ్లీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 59 మంది పాలస్తీనీయులు మృతి

హర్ష్ వర్ధన్ ష్రింగ్లా:భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, ప్రముఖ దౌత్యవేత్త.2023లో భారతదేశ G20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా  పనిచేశారు. 

ఉజ్వల్ నికమ్: సుప్రసిద్ధ పబ్లిక్ ప్రాసిక్యూటర్. 26/11 ముంబై ఉగ్రదాడులు వంటి అనేక హై-ప్రొఫైల్ కేసులలో ఆయన కీలక పాత్ర పోషించారు.

డా. మీనాక్షి జైన్: ప్రముఖ చరిత్రకారిణి, విద్యావేత్త. 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగానూ పని చేశారు. 

సి. సదానందన్ మాస్టర్:కేరళకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త. రాజకీయ హింసలో రెండు కాళ్ళూ కోల్పోయిన వ్యక్తి.

భారత రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. కళలు, సాహిత్యం, సామాజిక సేవ వంటి రంగాలలో కృషి చేసిన వారిని ఈ స్థానాలకు నామినేట్‌ చేస్తారు.

Also Read :  ఇదేక్కడి మాస్ రా మావా.. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో 5జీ ఫోన్ ఇంత చీపా.. ఓ లుక్కేయండి బాసూ!

Also Read :  పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

telugu-news | rajyasabha | droupadi-murmu | india

Advertisment
Advertisment
తాజా కథనాలు