Vijay Vs Pawan Kalyan: ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు త్వరలో థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మే 9కే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో మళ్ళీ పోస్ట్ ఫోన్ చేశారు. అయితే తాజాగా అప్డేట్ ప్రకారం.. నిర్మాత యం.రత్నం ఈనెల 30న మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.
Also Read: ‘35 ఏళ్లు అయింది..ఆ ఉంగరం, చేప ఎక్కడ ? రామ్ చరణ్, చిరంజీవి వీడియో వైరల్ !
రెండు సినిమాల క్లాష్
అయితే ఇదే రోజు విజయ దేవరకొండ 'కింగ్ డమ్' విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఒకవేళ రెండు సినిమాలను ఒకే రోజు విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ హీరోగా మారేదెవరు? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కింగ్‌డమ్ నిర్మాత నాగ వంశీకి పవన్ కళ్యాణ్‌తో ఉన్న సన్నిహిత సంబంధం ఉంది. దీంతో నాగవంశీ తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం కూడా ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది.
#HariHaraVeeraMallu Releasing On
— Milagro Movies (@MilagroMovies) August 21, 2022
March 30th 2023 🔥🔥 pic.twitter.com/KTMXQcuAzN
Also Read: Samantha: కొత్త ప్రయాణం మొదలైంది.. అతడితో సామ్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
జ్యోతి కృష్ణ దర్శకత్వంలో నాలుగేళ్ళ మొదలైన 'హరిహర వీరమల్లు' పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు మే 6న షూటింగ్ కి ప్యాకప్ చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్, రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ బిజీగా కొనసాగుతోంది.
telugu-news | cinema-news | Vijay Deverakonda Kingdom | Harihara Veeramallu
Also Read: ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!