/rtv/media/media_files/2025/05/07/4TjcOcAzrxVuGQdBlHML.jpg)
samantha new post viral
Samantha: అనారోగ్య సమస్యల తర్వాత మళ్ళీ సినిమాలతో బిజీ అయిన సామ్.. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్ లో రాబోతున్న 'శుభం' మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మే 9న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సామ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'కొత్త ప్రయాణం మొదలైంది' అనే క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ ఫొటోల్లో డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో ఉన్న ఫొటో కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సామ్ కి ఎంతో ఇష్టమైన పెట్ 'ఆష్' తో కూడా రాజ్ ఫొటోలకు ఫోజులిచ్చారు.
పెళ్లి చేసుకోబోతున్నారా.?
అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్- రాజ్ తో కలిసి మరోసారి ఫొటోలు షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు సామ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా? అని అనుకుంటున్నారు. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికీ.. వీరు మాత్రం వారిద్దరి మధ్య రిలేషన్ ఏంటనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే మరోవైపు .. సమంత- రాజ్ కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. వరుసగా రెండు వెబ్ సీరీస్ లలో కలిసి పనిచేయడం ద్వారా వారి పరిచయం బాగా పెరిగిందని, అందువల్ల కొందరు అలా అనుకుంటున్నారని తెలుస్తోంది. సామ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్ దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 1, 2, సిటాడెల్ సీరీస్ లు చేసింది. ప్రస్తుతం 'రక్త బ్రహ్మాండ్' కూడా చేస్తోంది.
telugu-news | latest-news | actress-samantha | samantha - raj nidimoru
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ