HBD KING NAGARJUNA: ఆ ఒక్క సినిమా కోసం నెలరోజులు డైరెక్టర్ చుట్టూ తిరిగిన కింగ్ .. నాగార్జున  బర్త్ డే స్పెషల్

అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.. 

New Update
HBD King Nagarjuna

HBD King Nagarjuna

HBD KING NAGARJUNA: ఏళ్ళు గడిచిన తరగని అందం, చరిష్మా ఆయన సొంతం!  మాస్, క్లాస్, రొమాంటిక్, భక్తిరస ఇలా పాత్ర ఏదైనా వాసివాడి తస్సాదియ్యా! అనిపించే నటన ఆయనది.  విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల మది గెలుచుకున్నారు.  ఆయన ప్రతీ సినిమాలో ఓ కొత్తదనం కోసం పరితపించారు.  ''శివ''  గా తనలోని యాంగ్రీ యంగ్ మ్యాన్ ని పరిచయం చేశారు. ''అన్నమయ్య'' తో  భక్తి రసాన్ని పండించాడు. ''గీతాంజలి'' తో ఓ భగ్న ప్రేమికుడిగా మారాడు. 'మన్మధుడి' గా లవర్ బాయ్ అవతారమెత్తి ప్రేక్షకుల మది దోచుకున్నాడు. ''సైమన్'' గా దీటైన ప్రతినాయకుడు అనిపించుకున్నాడు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు కుమారుడిగా వెండితెరకు పరిచయమైనా.. తనదైన స్టైల్, నటనతో ఎవర్ గ్రీన్  మన్మధుడిగా ముద్ర వేశారు.  అందం, అభినయం, ప్రయోగాలకు వెనుకాడని ధైర్యం.. కలగలిపిన హీరోగా పేరు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున(Nagarjuna)! నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.. 

Also Read :  'పెద్ది' లో చరణ్‌కు తల్లిగా యంగ్ హీరోయిన్.. చివరికి ఊహించని ట్విస్ట్!

సినీ ప్రయాణం.. 

ఒక స్టార్ హీరో కొడుకుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ఆయన సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ఎన్నో విజయాలు, అపజయాల చూశారు. 1986లో మధుసూదన్ రావు దర్శకత్వంలో వచ్చిన  'విక్రమ్' సినిమాతో నాగార్జున హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. 1988లో వచ్చిన 'ఆఖరి పోరాటం' తో మళ్ళీ ఊపందుకున్నారు నాగార్జున. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో  'గీతాంజలి'  మరో బ్లాక్ బస్టర్ కొట్టారు.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదొక క్లాసిక్ లవ్ స్టోరీ నిలిచిపోయింది. ఈ సినిమాతో నాగార్జున లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

నెల రోజులు వెంటపడ్డ నాగ్

అయితే మణిరత్నం 'మౌనరాగం' సినిమా చూసిన నాగ్ ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.  దానికోసం ప్రతిరోజు మణిరత్నం వాకింగ్‌కు వెళ్లే పార్క్‌కు వెళ్లి, నెల రోజులు ఆయన వెంటపడి, చివరికి కథ చెప్పించుకుని  'గీతాంజలి' సినిమా తీశారట.  

Also Read :  బిగ్ బాస్ ప్రియులకు పండగే.. షో లాంచ్ డేట్ వచ్చేసింది! కంటెస్టెంట్స్ ఫుల్ లిస్టిదే

కొత్త ట్రెండ్ 

గీతాంజలి తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన  'శివ' మరో సంచలనం సృష్టించారు నాగార్జున. ఇది  తెలుగు సినిమా ట్రెండ్ నే మార్చేసింది. కొత్త తరహా యాక్షన్ సినిమాలకు నాంది పలికింది. 'హలో బ్రదర్',  'ఘరానా బుల్లోడు', 'నిన్నే పెళ్లాడతా', మన్మధుడు  వంటి సినిమాలతో తనలోని కామెడీ, మాస్, రొమాంటిక్, ఫ్యామిలీ పాత్రలను పరిచయం చేస్తూ  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కింగ్. 

భక్తిరస చిత్రాలు 

నాగార్జున కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. . 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడీ సాయి', 'ఓం నమో వెంకటేశాయ' వంటి చిత్రాలతో తనలోని భక్తి రసాన్ని పండించారు. ఈ సినిమాల్లో పరమ భక్తుడిగా నాగార్జున నటన ప్రేక్షకులను భక్తి పరవశంలో ముంచెత్తింది. అంతేకాదు ఇందులో ఆయన నటనకు జాతీయ పురస్కారాలు కూడా వరించాయి. 

ఒకే ఏడాది 6 సినిమాలు

1987, 1990,  1991 సంవత్సరాల్లో ఒకే ఏడాది ఐదు నుంచి ఆరు సినిమాలు విడుదల చేసిన హీరోగా రికార్డు సృష్టించారు. . ఒకే ఏడాదిలో ఆరు సినిమాల్లో నటించడం అనేది చాలా అరుదైన విషయం. 

#telugu-film-news #telugu-cinema-news #telugu-news #latest-telugu-news #latest tollywood updates #akkineni-nagarjuna #HBD King Nagarjuna
Advertisment
తాజా కథనాలు