Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు మరో కొత్త సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ తో రాబోతుంది. ఈ మేరకు ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక.. షో ఫార్మాట్ ప్రణాళికలు పూర్తవగా.. తాజాగా సీజన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఎప్పటిలాగే సీజన్ 9 కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే గత సీజన్ల కంటే సీజన్ 9 డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రోమోలో నాగార్జున డబుల్ హౌస్, డబుల్ డోస్ అని చెప్పడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. దీని ప్రకారం ఈ షాలో రెండు హౌస్ లో ఉంటాయని తెలుస్తోంది. ఒక హౌస్ లో సెలెబ్రెటీలు, మరో హౌస్ లో కామనర్స్ ఉంటారు. మొత్తానికి సెలెబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా సీజన్ రసవత్తరంగా ఉండబోతుంది.
ఇప్పటికే కామనర్స్ ఎంపిక కోసం అగ్ని పరీక్ష అనే ప్రీషోను నిర్వహించారు. వేలాది మంది కామనర్స్ ఈ షోలో పాల్గొనేందుకు అప్లై చేయగా.. అందులో 40 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 40 మందికి అగ్ని పరీక్ష షో ద్వారా అనేక కఠినమైన పెడతారు. ఈ పరీక్షల్లో గెలిచిన టాప్ 3 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ షోకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
కంటెస్టెంట్స్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ కొంత మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమ్మాన్యుయెల్, సుమంత్ అశ్విన్, ముఖేష్ గౌడ, శివ కుమార్, రీతూ చౌదరీ, దీపికా, కావ్య శ్రీ, తేజస్విని, దేబ్జానీ, అలేఖ్య చిట్టి పికిల్స్ , నవ్యసామి, మై విలేజ్ షో అనిల్ హౌస్ లోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.