Actress Swasika: తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి స్వాసిక. ఇటీవలే నితిన్ తమ్ముడు సినిమాలో 'గుత్తి' అనే మాస్ క్యారెక్టర్ లో ఆకట్టుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. 31 ఏళ్ళ వయసున్న ఈ బ్యూటీకి 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్‌కు తల్లి పాత్ర పోషించడానికి అవకాశం వచ్చినట్లు తెలిపింది. అయితే చరణ్ కి ఆమెకు మధ్య చాలా తక్కువ ఏజ్ గ్యాప్ ఉండడంతో ఆఫర్ ని వద్దనుకున్నారట. గతంలో కూడా తనకు చాలా సార్లు తల్లి పాత్రల ఆఫర్లు వచ్చాయని, కానీ రామ్ చరణ్‌కు తల్లి పాత్ర పోషించాలనే ఆఫర్ మాత్రం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు.
"I was asked to play #RamCharan’s mother in #Peddi, but I said no.
— Movies4u Official (@Movies4u_Officl) August 24, 2025
At this point, I don’t feel the need to play Ram Charan’s mother."
- Malayalam Actress #Swasikapic.twitter.com/kTWjN41XAF
యాంకర్ గా కెరీర్
ఇదిలా ఉంటే.. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన స్వాసిక.. ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ‘చింతవిష్టయాయ సీత’, ‘సీత’ వంటి మలయాళ సీరియల్స్ ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. అలా వెండితెర వైపు కూడా అడుగులు వేసింది. తమిళ్ సినిమా 'వైగై' నటన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ్, మలయాళం, తెలుగు చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మెరిసింది. ఈ ఏడాది స్వాసిక మలయాళంలో ‘రండమ్ యమమ్’, తమిళంలో 'రెట్రో', తెలుగులో 'తమ్ముడు' సినిమాల్లో మెరిసింది. సినిమాలతో పాటు మరోవైపు సీరియల్స్ లో కూడా నటిస్తుంది. కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చెందిన స్వాసిక అసలు పేరు పూజ విజయ్ కాగా, తన స్క్రీన్ నేమ్ స్వాసికతో బాగా పాపులర్ అయ్యారు.