పెళ్ళైన మూడో రోజే.. మెడలో తాళి బొట్టుతో ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్, వీడియో వైరల్

కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. అదికూడా మెడలో మంగళసూత్రంతో ప్రమోషన్స్ కు రావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
keerti suresh

కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందూ, క్రిస్టియన్.. రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళై కనీసం వారం కూడా కాలేదు కీర్తి సురేష్ అప్పుడే తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. 

అదికూడా మెడలో మంగళసూత్రంతో ప్రమోషన్స్ కు రావడం విశేషం. కీర్తి సురేష్, వరుణ్ ధావన్ జంటగా 'బేబీ జాన్' అనే సినిమా తెరకెక్కింది. ఈ మూవీతోనే కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ మూవీ రిలీజ్ కానుంది. 

Also Read: ప్రశాంత్ వర్మ - మోక్షజ్ఞ మూవీ క్యాన్సిల్ అయిందా? నిర్మాణ సంస్థ ఏం చెప్పిందంటే

Also Read: కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి.. సూసైడ్ చేసుకున్న సింగర్ శృతి కన్నీటి కథ!

మెడలో తాళిబొట్టుతోనే..

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. ఈక్రమంలోనే కీర్తి సురేశ్ కూడా బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంది. మెడలో మంగళసూత్రంతోనే తన లేటెస్ట్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. 

వీటిని చూసి సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు.' మహానటి డెడికేషన్ వేరే లెవెల్ అయ్యా..' అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మాములుగా కొత్తగా పెళ్లైన హీరోయిన్లు.. తన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కొంత టైం తీసుకుంటారు. కానీ కీర్తి సురేష్ మాత్రం పెళ్లైన నాలుగు రోజులకే ఇలా మూవీ ప్రమోషన్స్ లో కనిపించడం విశేషం. 

Also Read : 'ఇండియన్ 2' కి నెగిటివ్ రివ్యూలు.. ఎట్టకేలకు నోరు విప్పిన శంకర్, ఏమన్నారంటే

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు