కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి.. సూసైడ్ చేసుకున్న సింగర్ శృతి కన్నీటి కథ!

ఫోక్ సింగర్ శృతి పెళ్ళైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అసలు శృతి ఎవరు..? ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె పాపులర్ ఫోక్ సింగర్ గా ఎలా ఎదిగింది..?  అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

New Update

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

శృతి ఎవరు..?

శృతి సిద్ధిపేట జిల్లా మహాదేవ్ పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పుట్టిపెరిగింది. అయితే చిన్నప్పటి నుంచి శృతికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో పెద్ద సింగర్ సింగర్ కావాలని కలలు కనేది.  ఆమె అభిరుచికి తగ్గట్లే పాటలు పాడడం పై దృష్టి పెట్టింది. జానపద గేయాలు పాడడంలో మంచి పట్టు సాధించింది. తన మధురమైన గాత్రంతో జానపదాలు పాడి ప్రజలను మైమరిపించింది. తెలంగాణలో ఎక్కడా సంగీత కార్యక్రమాలు జరిగిన శృతి హాజరై తన జానపద పాటలను వినిపించేది. 

అలా తాను పాడిన పాటలను ఇన్స్టా గ్రామ్ లో అప్లోడ్ చేసి అతి తక్కువ సమయంలోనే బాగా పాపులరైంది. ఆ తర్వాత శృతి యూట్యూబ్ లో ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించడం,  జానపద గీతాలు పాడడం ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. శృతి దూరదర్శన్ లో ప్రసారమయ్యే ఆటపాటా ఫోక్ సాంగ్ షోలో పాల్గొని.. తన పాటలతో మైమరిపించింది. శృతి  'పరుపు రాయి' అనే ఆల్బమ్ లో నటించింది.  శృతి పేరడీ పాటలకు కూడా బాగా పాపులర్. 

క్యాబ్ డ్రైవర్ తో పెళ్లి.. 

అదే ఇన్స్టాగ్రామ్ లో సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే వ్యక్తికి దగ్గరైన శృతి.. కొన్నాళ్ళకు అతనితో ప్రేమలో పడింది. దయాకర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు. శృతి తరచూ దయాకర్ ని చూడడానికి పీర్లపల్లి వస్తూ ఉండేది. కొద్దిరోజుల తర్వాత శృతి, దయాకర్ పెద్ద అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అందుకు శృతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో.. ఇద్దరు కలిసి 20 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే శృతి విషాదకరంగా తన జీవితాన్ని ముగించడం అందరి మనసుల్ని కలచివేసింది. 

ఇది కూడా చూడండి:  ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు