సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 చిత్రం థియేటర్‌లో అదరగొడుతోంది. ఇందులో అల్లు అర్జున్ 'పుష్ప రాజ్'గా, రష్మిక మందన్న 'శ్రీవల్లి'గా, ఫహద్ ఫాసిల్ 'భన్వర్ సింగ్ షెకావత్'గా నటించారు. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు వసూళ్లు చేసి అబ్బురపరచింది. తాజాగా ఈ మూవీ నిర్మాతలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! "క్షత్రియ" కమ్యూనిటీని కించపరిచారు పుష్ప 2 చిత్రంలో "షెకావత్" పాత్రను నెగిటివ్‌గా చూపించారని ఓ వ్యక్తి పేర్కొన్నారు. "క్షత్రియ" కమ్యూనిటీని కించపరిచేలా పుష్ప 2 సినిమాలో "షెకావత్" పాత్ర ఉందని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్‌పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆదివారం "పుష్ప 2" నిర్మాతలను బెదిరించారు. Also Read: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! సినిమాలో "షెకావత్" అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల సమాజాన్ని అవమానించారని ఆరోపించారు. పుష్ప 2 నిర్మాతలు ఈ పదాన్ని సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో షేర్ చేశారు. ""ఈ సినిమాలో క్షత్రియులను ఘోరంగా అవమానించారు. "షెకావత్" కమ్యూనిటీ తప్పుగా చూపించబడింది. Also Read: ఉదయించే సూర్యుడికి శత్రువుగా ఉంది రెండాకుల గుర్తే..! భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో క్షత్రియులను అవమానిస్తున్న ఈ పరిశ్రమ మళ్లీ అదే పని చేసింది. సినిమా నిర్మాతలు "షెకావత్" అనే పదాన్ని సినిమా నుంచి తొలగించాలి, లేకుంటే కర్ణి సేన.. పుష్ప 2 మూవీ నిర్మాతలపై దాడి చేస్తుంది. అవసరమైతే ఎంతకైనా తెగిస్తుంది" అని వీడియోలో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో నిర్మాతల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా కొనసాగుతోంది. Remove Shekhawat word or we will thrash you. - #RajShekhawat threatens #Pushpa2 Makers #AlluArjun #Sukumar #Rashmika #Pushpa #FahadhFaasil #Pushpa3 pic.twitter.com/jXpKuhvBHN — BuzZ Basket (@theBuzZBasket) December 9, 2024 Also Read: తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు! పుష్ప 2 కలెక్షన్స్ పుష్ప 2 చిత్రం విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్ల రూపాయల రాబట్టి దుమ్ము దులిపేసింది. దాని కలెక్షన్లతో పుష్ప 2 హిందీ భాషలో షారుఖ్ ఖాన్ "జవాన్" మొదటి రోజు రికార్డును బద్దలు కొట్టింది. అదే సమయంలో ఈ మూవీ "RRR" రికార్డును సైతం బద్దలు కొట్టింది. దీంతో ఈ మూవీ ఆల్ టైమ్ అతిపెద్ద దేశీయ ఓపెనర్‌గా నిలిచింది. ఇక నాలుగో రోజు ఈ సినిమా రూ.829 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.