Akhanda 2: సౌండ్ కంట్రోల్ పెట్టుకో.. 'అఖండ 2’ బ్లాస్టింగ్‌ రోర్‌! గూస్ బంప్స్ వీడియో

బాలయ్య- బోయపాటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ2 తాండవం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అఖండ 2: తాండవం’. ‘బ్లాస్టింగ్‌ రోర్ టైటిల్ తో చిన్న గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు.

New Update

Akhanda 2:  బాలయ్య- బోయపాటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ2 తాండవం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అఖండ 2: తాండవం’. ‘బ్లాస్టింగ్‌ రోర్ టైటిల్ తో చిన్న గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.  "సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో... ఏ సౌండ్‌కి నవ్వుతానో, ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు కొడకా... ఊహకి కూడా అందదు" అంటూ పవర్ ఫుల్ డైలాగులతో దుమ్ములేపారు బాలయ్య.  వీడియోలో బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, యాక్షన్, డైలాగ్స్ ఫ్యాన్స్ ఫుల్ కిక్కిచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. విడుదలకు ముందే మంచి ప్రమోషనల్ కంటెంట్ తో ఫుల్ హైప్ ఎక్కిస్తున్నారు మేకర్స్. 

డిసెంబర్ 5న విడుదల 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, గ్రాఫిక్స్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో వాయిదా వేశారు.  పార్ట్ 1 మాదిరిగానే.. పార్ట్ 2 లో కూడా బాలయ్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. కుర్ర హీరో ఆదిపినిశెట్టి ఇందులో విలన్ నటించడం మరో ఆసక్తికరమైన విషయం. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. 'భజరంగీ భాయిజాన్' చైల్డ్ ఆర్టిస్ట్  హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తోంది. 

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు  హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట, బాలయ్య కూతురు తేజశ్విని సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.  ఎస్ . ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  ఈసారి తమన్ మ్యూజిక్ తో థియేటర్లు దద్దరిల్లి పోనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్

Advertisment
తాజా కథనాలు