/rtv/media/media_files/2025/10/25/divya-suresh-2025-10-25-08-33-47.jpg)
divya suresh
Accident: కన్నడ బిగ్ బాస్ నటి దివ్య సురేష్ హిట్ అండ్ రన్ కేసులో పట్టుబడ్డారు. అక్టోబర్ 4న తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత బైక్ డ్రైవర్ కిరణ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్టోబర్ 7న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట కారును గుర్తు తెలియనిది.. దానిని ఒక మహిళ నడిపినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తులో సీటీవీ ఫుటేజ్ లు పరిశీలించగా.. ఆ కారు నడిపింది దివ్య సురేష్ అని తేలింది. దీంతో దివ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె కారును స్వాధీనం చేసుకున్నారు. అలాగే తదుపరి విచారణ కూడా జరుగుతోందని తెలిపారు.
Kannada Actor Divya Suresh Identified As Driver In Bengaluru Hit-And-Run https://t.co/B24uCthpO0pic.twitter.com/OeE6yVltac
— NDTV News feed (@ndtvfeed) October 24, 2025
Also Read: Bigg Boss 9: అయ్యో.. బిగ్ బాస్ ఇంట్లో కుప్పకూలిన తనూజ! షాక్ లో కంటెస్టెంట్లు!
Follow Us