Pradeep Ranganathan: హీరో మెటీరియల్ కాదంటూ ప్రదీప్ రంగనాథ్ కు అవమానం.. శరత్ కుమార్ దిమ్మతిరిగే ఆన్సర్!-VIRAL VIDEO

"మీరు హీరో మెటీరియల్‌లా లేరు... కానీ రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు" అంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ ని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

New Update
Pradeep Ranganathan

Pradeep Ranganathan

Pradeep Ranganathan: "మీరు హీరో మెటీరియల్‌లా లేరు... కానీ రెండు సినిమాలకే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అరుదు" అంటూ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan Dude) ని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మాటలకు ప్రదీప్ కూడా చాలా హుందాగా.. రీపోర్టర్ నోరుమూసుకునేలా బదులిచ్చారు.  ''ఒక సాధారణ యువకుడిలా కనిపించడం వల్లే యువత నన్ను త్వరగా కనెక్ట్ చేసుకోగలుతున్నారు! నా లాంటి ఆశలతో ఉన్న ఎంతో మంది యూత్ నాలో వాళ్ళను చూసుకుంటున్నారు. నన్ను స్క్రీన్ పై చూసినప్పుడు వాళ్ళే హీరో, వాళ్లే నటిస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు.  నాలో వాళ్ళని చూసుకుంటున్నారు అంటే నేను హీరోనే'' అంటూ బదులిచ్చారు. ప్రదీప్ చెప్పిన ఈ మాటలు ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. అంతేకాదు ప్రదీప్ ఈ సమాధానం చెప్పగానే..  ఈవెంట్‌లో ఉన్న ఫ్యాన్స్ అంతా "హీరో! హీరో!" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై సీనియర్ నటుడు శరత్ కుమార్ కూడా స్పందిస్తూ.. సమాజానికి మంచి చేసేవారు, చెప్పే ప్రతి ఒక్కరూ హీరోలే అంటూ గట్టిగా బదులిచ్చారు. 

Also Read :  రీతూకి దొబ్బిన చిప్.. భరణి హౌజ్ లో వేస్ట్ .. నాగ్ మామ ముందే రెచ్చిపోయిన ఆడియన్!

హీరో అంటే ఏంటీ? 

కెరీర్ ఆరంభంలోనే  రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్ అందుకున్న ప్రదీప్ ను రిపోర్టర్ ఇలాంటి ప్రశ అడగడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేసింది.  దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.అసలు హీరో అంటే ఏంటీ..  సిక్స్ ప్యాక్, ఆరడుగుల ఎత్తు,  భారీ బ్యాక్ గ్రౌండ్ , వంశ చరిత్ర ఇవేనా? అయినా ఒక సినిమాలో నటించడానికి కలర్, క్యాస్ట్, ఫ్యామిలీ, లుక్స్ తో పనిలేదు.. టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటూ రిపోర్టర్ పై మండిపడుతున్నారు.  అయినా.. హీరో అంటే సిక్స్ ప్యాక్, ఆరడుగుల ఎత్తు,  భారీ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి, వారసత్వం ఉండాలనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ప్రేక్షకుల సినిమా చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. సిక్స్ ప్యాక్ లు, బాడీ ప్యాక్ లు అవసరంలేదు.. కథలో దమ్మున్నోడే హీరో అని గడ్డిపెడుతున్నారు నెటిజన్లు. 

Also Read: Nabha Natesh: నాభీ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ! ఫొటోలు చూస్తే ఫిదా!

Advertisment
తాజా కథనాలు