HBD Kamal Haasan: కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా ఎదిగిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి అందులో సాధించిన ఘనతల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..

New Update
dfd

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆల్ రౌండర్ గా ఎదిగిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ పుట్టిన రోజు ఈ రోజు.ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో సాధించిన ఘనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కమల్ హాసన్  ఐదేళ్ల వయసులోనే బాల నటుడిగా సినీ ఆరంగేట్రం చేశారు. ‘కలతూర్‌ కన్నమ్మ’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించాడు. 

1974లో మలయాళంలో వచ్చిన 'కన్యాకుమారీ' కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. 1977లో వచ్చిన ‘పదనారు వయదినిలె’ కమల్ హాసన్ కెరీర్ ను మలుపుతిప్పింది. అక్కడి నుంచి కలం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీలో తిరుగులేని కథానాయకుడిగా ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నారు. మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’,‘శుభ సంకల్పం’.. సినిమాలు కమల్ కు తెలుగులో స్టార్ డం తెచ్చిపెట్టాయి. 

Also Read :  ట్రంప్ గెలిచాడు.. బంగారం ధరలు పడిపోయాయి!

కోటి రెమ్యునరేషన్ తీసుకున్న ఫస్ట్ హీరో..

ఆ తర్వాత హిందీలోనూ సత్తా చాటారు. సినీ పరిశ్రమలో రూ.కోటి రెమ్యూనరేషన్‌ తీసుకున్న తొలి భారతీయ నటుడు కూడా ఈయనే కావడం విశేషం. సూపర్ స్టార్  రజినీకాంత్‌తో కమల్ హాసన్ ప్రత్యేక అనుబంధం. రజినీకాంత్‌తో కలిసి కమల్ 19 చిత్రాల్లో నటించారు. ఎన్నో చిత్రాల్లో కమల్ హాసన్ హీరోగా నటిస్తే.. రజినీకాంత్ విలన్‌గా నటించడం విశేషం. ఆయన చేసిన ప్రయోగాత్మక పాత్రలో సినీ ఇండస్ట్రీలో మరెవ్వరో చేసుండరేమో.

భారీ ప్రయోగాలు..

1988లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'పుష్పక విమానం' అలాంటిదే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ వండర్ క్రియేట్ చేసింది. ‘విచిత్ర సోదరులు’ సినిమాలో పొట్టివాడిగా నటించి మెప్పించారు. ‘భామనే సత్యభామనే’ సినిమాలో ఆడ వేషంలోనూ ఆకట్టుకున్నారు. ఇక ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది పాత్రలతో మెప్పించాడు. 

Also Read :  యంగ్ హీరోతో పెళ్లి కి రెడీ అయిన ప్రభాస్ హీరోయిన్..!?

తెలుగులో అత్యధిక అవార్డులు..

చిత్ర పరిశ్రమలో ఓ హీరో ఒకే సినిమాలో పది పాత్రలు పోషించడం కేవలం కమల్ కు మాత్రమే దక్కింది. ఈ రికార్డు ఇప్పటికీ కమల్ పేరు మీదే ఉంది. తెలుగులో ఎక్కువ చిత్రాల్లో నటించడమే కాదు.. ఆక్కడ అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు.  తెలుగులో ‘స్వాతి ముత్యం’,‘సాగర సంగమం’,‘ఇంద్రుడు చంద్రుడు’ వంటి సినిమాల్లో నటనకు మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించారు. 

హీరోగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చాచీ 420’. అది ఈయన హీరోగా నటించిన ‘అవ్వై షన్ముగి’ (తమిళం) సినిమాకి రీమేక్‌. ‘హేరామ్‌’, ‘విరుమాండి’, ‘విశ్వరూపం’ తదితర చిత్రాలు కమల్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రతీకలని చెప్పొచ్చు. అటు నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాతగానూ కమల్‌ తన హవా కొనసాగించారు.  

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

 230 సినిమాలు.. 171 అవార్డులు..

ఇప్పటిదికా సుమారు 230 కి పైగా సినిమాలు చేసిన కమల్ తన కెరీర్లో.. మొత్తం 171 అవార్డులు పొందాడు. అందులో 18 ఫిలిం ఫేర్ అవార్డులున్నాయి. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గానూ నిలిచారు. ఆయన నటించిన ఆరు చిత్రాలను.. ఆస్కార్ అవార్డుకు పంపించారు. 

 

#indian-cinema-industry #kamal-haasan #kamal-haasan-birthday
Advertisment
Advertisment
తాజా కథనాలు