HBD Anushka: యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ సినీ పరిశ్రమలో హీరోకు సమానమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందుగా వినిపించే పేరు మాత్రం 'అనుష్క శెట్టి'. నేడు అనుష్క బర్త్ డే. ఈ సందర్భగా ఆమె సినీ కెరీర్ కు సంబంధించి ఆసక్తికర విశేషాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Anil Kumar 07 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి సినీ పరిశ్రమలో హీరోకు సమానమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ముందుగా వినిపించే పేరు మాత్రం 'అనుష్క శెట్టి'. టాలీవుడ్ అంతా ఆమెను జేజమ్మ అని ముద్దుగా పిలుచుకుంటారు. అభిమానులు మాత్రం స్వీటీ అని అంటారు. నేడు అనుష్క బర్త్ డే. ఈ సందర్భగా ఆమె సినీ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read : వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ 'సూపర్' తో ఎంట్రీ.. 2005లో వచ్చిన ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా సూపర్ ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగ టీచర్ గా వర్క్ చేసింది. ఆమె అసలు పేరు స్వీటీ శెట్టి. కింగ్ అక్కినేని నాగార్జున, దర్శకుడు పూరీ జగన్నాథ్ లు ఆమెను 'అనుష్క' అనే స్క్రీన్ నేమ్ తో పరిచయం చేసారు. మొదటి సినిమాలోనే గ్లామర్ రోల్ తో ఆకట్టుకుంది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రధాన్యమున్న సినిమాలు చేసింది. Also Read : వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్! 'అరుంధతి' తో కెరీర్ టర్న్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'అరుంధతి' సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎంతలా పెరిగిందంటే ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రభాస్ 'బిల్లా' సినిమాలో బికినీ ధరించి అందరికీ షాక్ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ జోడీగా నటించింది అనుష్క. తన ఫస్ట్ హీరో నాగ్ తో ఎక్కువ సినిమాల్లో జత కట్టిన ఈ బ్యూటీ.. తక్కువ కాలంలోనే టాప్ పొజిషిన్ కు చేరుకుంది. Also Read : కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా? లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా.. 'వేదం' సినిమాలో వేశ్యగా ఛాలెంజింగ్ రోల్ లో నటించి ఆడియన్స్ తో పాటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించాయి. సౌత్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి ఎక్కువ సక్సెస్ రేట్ అందుకున్న ఏకైక హీరోయిన్ కూడా అనుష్కే కావడం విశేషం. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుని.. అనుష్క తర్వాత నయన్ తార, సమంత, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా.. అనుష్క రేంజ్ లో సక్సెస్ కాలేకపోయారు. అలా అప్పట్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే 'బాహుబలి' తో నెక్స్ట్ లెవెల్ క్రేజ్.. అనుష్క కెరీర్ ను టాప్ పొజిషన్ కు తీసుకెళ్లిన మరో సినిమా 'బాహుబలి'. ఈ సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. ఈ సినిమాతో అనుష్క కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 2021 తర్వాత మూడేళ్లు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ హీరోయిన్.. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇన్నేళ్ల తన కెరీర్‌లో దాదాపు 47 చిత్రాలకు పైగా చేసింది. #happy-birthday-anushka #tollywood #anushka-shetty మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి