/rtv/media/media_files/2025/09/30/prabhas-raja-saab-2025-09-30-20-19-50.jpg)
Prabhas Raja Saab
Raja Saab First Single: ప్రభాస్(Prabhas)-మారుతీ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్ కామెడీ “ద రాజా సాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పాట విడుదల తేదీ పలుమార్లు మారడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. మొదట ఈ పాటను ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత నవంబర్ మొదటి వారానికి మార్చినా, ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో #WakeUpRajaSaab వంటి హాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
నవంబర్ 24న రాజా సాబ్ ఫస్ట్ సింగిల్?
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ నవంబర్ 24న విడుదల కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా టీమ్ ఈ వారం ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం వల్ల, ఈ నెల లోపలే ప్రమోషన్స్ ప్రారంభించాల్సిన అవసరం టీమ్‌కు ఉంది.
దర్శకుడు మారుతీ ఈ సినిమాను ఫుల్ ఎంటర్టైనింగ్ హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తర్వాత ఎక్కువగా సీరియస్ యాక్షన్ సినిమాలతో కనిపించిన ప్రభాస్, ఈసారి తన కామెడీ యాంగిల్‌ను మళ్లీ చూపించబోతున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైట్ సీక్వెన్స్ షూట్ పూర్తయితే మొత్తం చిత్రీకరణ ముగిసినట్టే. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్ ప్రకారం ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి సంజయ్ దత్, బొమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తంగా, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “ద రాజా సాబ్” ఫస్ట్ సింగిల్ చివరకు రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ వేగం పెరగనుంది.
Follow Us