హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కొంతవరకు షూటింగ్ జరుపుకోగా.. ఇటీవల ఏపీ ఎలక్షన్స్ వలన వాయిదా పడింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Also Read : ఆమె జాగ్రత్త.. ఇదే నా లాస్ట్ వీకెండ్: రష్మిక పోస్ట్ వైరల్!
ఈ క్రమంలోనే ఈ మూవీ సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్‌కి సంబంధించి మార్పులు చేస్తున్నట్లు న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మార్పులు చేయమని హరీశ్‌ను పవన్ కోరగా.. హరీశ్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
Also Read : ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
Also Read : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్..?
డైలాగ్స్ వెర్షన్ కూడా..
కొన్ని రోజుల క్రితం హరీశ్ శంకర్ పవన్‌ను కలవగా.. ఈ మార్పులు గురించి చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో డైలాగ్స్‌కు సంబంధించి కూడా వాటి వెర్షన్‌ను మార్చమని పవన్ కోరారని, అందుకు తగ్గట్లు హరీశ్ స్క్రిప్ట్ రీవర్క్ చేస్తున్నారని సమాచారం.
అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' తో కమర్షియల్ గా బిగ్ సక్సెస్ అందుకున్న హరీష్ శంకర్.. ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' తో అదిరిపోయే సోషల్ మెసేజ్ ఇవ్వనున్నారట. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : 'పుష్ప2' ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్.. బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే?