/rtv/media/media_files/2024/11/03/pPF4OMvGxDniLgLU5Lry.jpg)
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే హను రాఘవ పూడి, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిన ఈ హీరో 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.
Also Read : ఈ ఆకులతో పైల్స్‌కు చెక్ పెట్టండిలా!
అయితే డార్లింగ్ ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు.. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తో పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ అని సమాచారం.. ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లోకేష్ కనగరాజ్‌తో చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Prabhas - Lokesh Kanagaraj
— Sandeep Reddy (@urssandeep_) November 2, 2024
Massive Collab.....❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/qlLJVr2oGu
Also Read : 'పుష్ప2' ఐటెం సాంగ్ కోసం హీరోయిన్ ఫైనల్.. బన్నీతో స్టెప్పులేసేది ఎవరంటే?
'LCU' లో భాగమా?
పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ బ్యానర్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ 'LCU' లో భాగంగా ఉంటుందా? లేదా స్టాండ్ లోన్ మూవీనా? అనే దానిపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
#Prabhas - #LokeshKanagaraj ✅
— Puneeth Krishna (@PuneethTweets) August 1, 2023
Produced by MythriMovieMakers
Music By Anirudh pic.twitter.com/8n9C4LLHD3
Also Read : న్యూజిలాండ్ క్లీన్ స్వీప్.. 0-3తో సిరీస్ కైవసం!
ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయినా కూడా సినిమా మాత్రం ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే అటు ప్రభాస్ ఇటు లోకేష్ వరుస సినిమాలను కమిట్ అయి ఉన్నారు. అవన్నీ పూర్తి చేయడానికి కనీసం మూడేళ్లయినా పడుతుంది. అప్పటి దాకా డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి ప్రస్తుతం 'కూలీ' సినిమా చేస్తుండగా.. ప్రభాస్, హను రాఘవపూడి మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
Also Read : హౌస్ నుంచి క్రై బేబీ అవుట్.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?