/rtv/media/media_files/2025/07/14/hari-hara-veeramallu-pre-release-event-2025-07-14-18-41-36.jpg)
Hari Hara VeeraMallu
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అయితే మూవీ టీం ఇప్పటికే ట్రైలర్, మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇవి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే హరిహర వీరమల్లు మూవీ గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ, నిర్మాత ఎ.ఎం. రత్నం ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఒకే సన్నివేశం కోసం..
ఈ మూవీలో యుద్ధ సన్నివేశాల కోసం పవన్ కల్యాణ్ ఎంతగానో శ్రమించారని జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సినిమాలో ఒక పోరాట సన్నివేశాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని జ్యోతికృష్ణ వెల్లడించారు. పవన్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ప్రతి ఫైట్‌లోనూ కనిపిస్తాయని, సినిమాలో ప్రతి ఫైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన చెప్పారు.
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’
పవన్ డిజైన్ చేసిన ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 60 రోజులు చిత్రీకరించామని, డూప్స్‌ను ఉపయోగించకుండా పవన్ స్వయంగా చేశారని తెలిపారు. ఇది బ్రూస్ లీ 'ఎంటర్ ది డ్రాగన్' సినిమాలోని ఫైట్‌ను తలపించేలా ఉంటుందని, ఆ వార్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
4 రకాల ఆయుధాలతో వార్ సీక్వెన్స్ కోసం పవన్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారని, విదేశీ స్టంట్ మాస్టర్లతో పాటు పీటర్ హెయిన్ కూడా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను పర్యవేక్షించారని జ్యోతికృష్ణ వివరించారు. ఈ సినిమాలో పవన్‌ను ఇప్పటివరకు ఎన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో చూడబోతున్నామని ఆయన అన్నారు.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్