Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి నిధి అందాల సాంగ్‌.. సూపరెహే

పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అంద చందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

New Update

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ‘తార తార’ అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో నిధి అగర్వాల్ తన అంద చందాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ అదరగొడుతోంది. 

Hari Hara Veera Mallu Song

Also Read: 5వ తరం జెట్ ను అభివృద్ధి చేస్తున్న ఇండియా

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రారంభమై రెండు మూడేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీగా ఉండటంతో ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చాలా డేట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్లు వాయిదా వేశారు. చివరికి జూన్ 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్‌, గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

Also Read: స్టూడెంట్స్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న ట్రంప్..వీసా ఇంటర్వ్యూలు నిలిపేయాలని  ఆదేశం

ఇప్పుడు మరో సాంగ్‌ను రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశారు. ఇందులో నిధి అందాలు ఆరబోసి అబ్బురపరచింది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు